Cinema : ఆమె గొప్ప నటి.. కోట్ల ఆస్తులు.. లగ్జరీ జీవితం.. చివరకు డబ్బుల కోసం చేయిచాచే పరిస్థితి.. బస్టాండ్ లో అనాథ శవంలా..

వెండితెరపై అందం, అభినయంతో అలరించింది. ముఖ్యంగా తన నటనతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. ఒకప్పుడు చేతినిండా సినిమాలతో అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగింది. స్టార్ హీరోలతో సమానంగా క్రేజ్ సొంతం చేసుకుంది. అడిగినవారికి లేదనకుండా సాయం చేసింది. కానీ పెళ్లి తర్వాత జీవితం తలకిందులైంది. భర్త చేతిలో టార్చర్ చూసింది. చివరకు అప్పులపాలైంది.

Cinema : ఆమె గొప్ప నటి.. కోట్ల ఆస్తులు.. లగ్జరీ జీవితం.. చివరకు డబ్బుల కోసం చేయిచాచే పరిస్థితి.. బస్టాండ్ లో అనాథ శవంలా..
Girija

Updated on: Apr 11, 2026 | 11:44 AM

సినీరంగంలోకి కమెడియన్స్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేర్లు బ్రహ్మానందం, అలీ, వేణు మాధవ్, సునీల్. ఇలా చాలా మంది ఉన్నారు. ఇక లేడీ కమెడియన్స్ అంటే కోవై సరళ. కానీ ఓ 50 సంవత్సరాలు వెనక్కు వెళ్తే.. అప్పట్లో వెండితెరపై తమ నటనతో కామెడీ టైమింగ్ తో నవ్వులు పూయించిన తారలు చాలా మంది ఉన్నారు. అప్పట్లోనే అగ్రనటుల మధ్య లేడీ కమెడియన్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న నటి గిరిజ. అంతేకాదు.. తెలుగులో తొలిసారిగా స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న నటి ఆమె. పాతాళ భైరవి సినిమాలో తోట రాముడిని నరుడా ఏమీ నీ కోరిక అనే ఒక్క డైలాగ్.. ఆమె జీవితాన్ని మార్చేసింది. ఆ సినిమాలో దేవతగా కనిపించింది. తెలుగులో ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించింది. అప్పట్లోనే స్టార్ డమ్ సంపాదించుకున్న ఆమె.. చివరి రోజుల్లో మాత్రం జీవితాన్ని విషాదంగా గడిపింది. తెరపై అందరినీ నవ్వించిన ఆమె.. జీవితం మాత్రం పెను విషాద ముగింపు పలికింది. గిరిజ.. ఒకప్పుడు చేతినిండా సినిమాలు.. కోట్లాది ఆస్తులు.. అడిగినవారికి కాదనకుండా సాయం చేసే మంచి మనస్తత్వం ఉన్న నటి.

కానీ పెళ్లి ఆమె జీవితాన్ని తలకిందులు చేసింది. సన్యాసిరావు అనే వ్యక్తిని తిరుపతిలో పెళ్లి చేసుకుంది గిరిజ. భర్తతో కలిసి సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించి భలే మాస్టారు, పవిత్ర హృదయాలు అనే సినిమాలు తెరకెక్కించింది. కానీ ఆ చిత్రాలు సరిగ్గా ఆడకపోవడంతో తీవ్ర నష్టాలు చూసింది. భర్త అధిక ఖర్చులు..జల్సాలు, తాగిన మైకంలో ఆమెను కొట్టడం చేసేవాడు. భార్య, పిల్లలను ముప్పుతిప్పలు పెట్టాడు. డబ్బంతా ఖర్చు పెట్టాకా ఒకరోజు ఎక్కడికో వెళ్లిపోయి మళ్లీ రాలేదు. లగ్జరీ జీవితం చూసిన గిరిజ.. తర్వాత అప్పులపాలై.. చెన్నైలోని చిన్న గదికి మారింది. చివరి రోజుల్లో అవసరాలకు తెలిసినవారి దగ్గర రూ.50, రూ.100 అడిగేదట.

చివరి రోజుల్లో గిరిజ ఎన్నో కష్టాలు పడిందని.. తన దగ్గర డబ్బు కావాలని అడిగిందని డ్యాన్స్ మాస్టర్ సురేష్ దాస ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. కొన్ని రోజులకు ఆమె తన ఇంటి దగ్గర బస్టాపులో చనిపోయి కనిపించిందని చెబుతూ భావోద్వేగానికి గురయ్యాడు. మరో ఇంటర్వ్యూలో సీనియర్ నటి వై. విజయ మాట్లాడుతూ.. నటి గిరిజ చెన్నైలోని తన ఇంటికి వచ్చి ఖర్చులకు డబ్బులు అడిగేదని గుర్తుచేసుకున్నారు. అయితే  గిరిజ మరణంపై ఆమె కూతురు శ్రీగంగ చెప్పేది వేరేలా ఉంది. కొంతకాలం క్రితం ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘ మా అమ్మ బస్టాప్‌లో మరణించలేదు. ఇంట్లోనే చనిపోయింది. గిరిజ మరణవార్త తెలిసినా చివరి చూపు చూసేందుకు సినిమా వాళ్లు ఎవరూ రాలేదు అని అన్నారు. ఒకప్పుడు కోట్ల ఆస్తులు.. లగ్జరీ జీవితం చూసిన గిరిజ.. చివరి క్షణాల్లో మాత్రం ఆర్థికంగా చితికిపోయారు. గిరిజ చనిపోయిన రోజు తనను చూసేందుకు ఇండస్ట్రీ నుంచి ఎవరూ వెళ్లలేదు. కానీ నటుడు శోభన్ బాబు మాత్రం ఆమె కూతురికి కాల్ చేసి ఏ అవసరం ఉన్నా తానున్నానంటూ ధైర్యం చెప్పారని.. ఆ మరుసటి రోజు అల్లు రామలింగయ్య స్వయంగా వెళ్లి పరామర్శించారట.

ఎక్కువ మంది చదివినవి : Mrunal Thakur : అతడే నా లక్కీ ఛార్మ్.. అతడు లేకపోతే నేను లేను.. హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కామెంట్స్..

Follow Us