సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియా సినిమాలు చేయకపోయినా దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు మహేష్ కు. టాలీవుడ్ లో టాప్ హీరోగా కంటిన్యూ అవుతున్న మహేష్ బాబు ప్రస్తుతం వరుస సినిమాలను లైనప్ చేసి ప్రేక్షకులను ఖుష్ చేస్తున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మాస్ మసాలా ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే సెకండ్ హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటిస్తుంది. ఈ మూవీ నుంచి విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో మహేష్ డిఫరెంట్ లుక్ లో రఫ్ గా కనిపించనున్నారు.
అలాగే రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు మహేష్. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది. త్రివిక్రమ్ సినిమా దాదాపు చివరి దశకు వచ్చేసిందని తెలుస్తోంది. నాన్ స్టాప్ గా షూటింగ్ చేసి సంక్రాంతి పండగకు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అలాగే ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే మహేష్ రాజమౌళి డైరెక్షన్ లో చేసే సినిమాను మొదలు పెట్టనున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.