ఇదెక్కడి కళాఖండంరా బాబు..! ఇండియాలోనే అతి పెద్ద డిజాస్టర్‌ మూవీ ఇదే

|

Jun 22, 2024 | 2:43 PM

పెద్ద సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా కలెక్షన్స్ మాత్రం కుమ్మేస్తున్నాయి. పెట్టిన దానికి రెండింతలు వసూల్ చేస్తున్నాయి బడా హీరోల సినిమాలు. అలాగే చిన్న హీరోలు కూడా మంచి కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ డీసెంట్ వసూళ్లను రాబడుతున్నారు.

ఇదెక్కడి కళాఖండంరా బాబు..! ఇండియాలోనే అతి పెద్ద డిజాస్టర్‌ మూవీ ఇదే
Movie News
Follow us on

ఇప్పుడు ఎక్కడ చూసిన పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తుంది. చిన్న చిన్న సినిమాలు కూడా భారీగా వసూల్ చేస్తున్నాయి. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి భారీ హిట్స్ అందుకుంటున్నాయి కొన్ని సినిమాలు. ఇక పెద్ద సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా కలెక్షన్స్ మాత్రం కుమ్మేస్తున్నాయి. పెట్టిన దానికి రెండింతలు వసూల్ చేస్తున్నాయి బడా హీరోల సినిమాలు. అలాగే చిన్న హీరోలు కూడా మంచి కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ డీసెంట్ వసూళ్లను రాబడుతున్నారు. అయితే మనం ఎప్పుడు హిట్ సినిమాల గురించి ఎక్కువగా చూస్తుంటాం.. ఆ సినిమా అన్ని కోట్లు వసూల్ చేసింది..! ఈ సినిమా రికార్డ్ క్రియేట్ చేసింది.. అంటూ రకరకాల వార్తలు చూస్తూనే ఉంటాం.. కానీ ఓ సినిమా ఇండియాలోనే బిగెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.

పరమ చెత్త సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. 40 లక్షలకు పైగా ఖర్చు చేసి సినిమా తీస్తే కనీసం లక్ష రూపాయిలు వసూల్ చేయలేదు. దాంతో నిర్మాత నిండా మునిగిపోయాడు. ఇంతకు ఆ సినిమా ఎదో తెలుసా.? ఆ కళాఖండం పేరు ‘ది లేడి కిల్లర్’ బాలీవుడ్ లో తెరకెక్కింది ఈ సినిమా అర్జున్ కాపుర్ హీరోగా నటించిన ఈ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది. గత ఏడాది రిలీజ్ అయిన ఈ సినిమాకు అజయ్ బేహల్ దర్శకత్వం వచ్చారు. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర అత్యంత డిజాస్టర్ సినిమాగా ఈ సినిమా నిలిచింది.

అర్జున్ కపూర్, భూమి ఫడ్నేకర్ కలిసి నటించిన ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కించారు. ఈ సినిమా కోసం మొత్తంగా 45 లక్షలు ఖర్చు చేశారు. అలాగే ప్రమోషన్స్ అన్ని కలుపుకొని ఓ రెండు కోట్లవరకు ఖర్చయింది. కానీ బకాఫీస్ వద్ద మినిమమ్ వసూల్ చేయలేకపోయింది ఈ సినిమా. ఓవరాల్‌గా ఈ సినిమా లక్ష రూపాయలు కూడా కలెక్ట్ చేయలేక అతి పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది.. నిజానికి ఈ సినిమా షూటింగ్ పూర్తికాకుండానే థియేటర్స్ లో సినిమాను రిలీజ్ చేశారు. అలాగే బడ్జెట్ పెరిగిపోవడంతో చివర్లో నిర్మాతలు చేతులెత్తేశారు. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే సినిమాను ఎడిట్ చేసి థియేటర్స్ లో కొన్ని సీన్స్ ను యాడ్ చేద్దాం అనుకున్నారు.. కానీ సినిమా దారుణంగా డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమా కేవలం రూ.70 వేల కలెక్షన్లు మాత్రం తెచ్చుకుంది. దాంతో నిర్మాతలు భారీగానే నష్టపోయారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.