
టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా క్రేజ్ సంపాదించుకోవడానికి జాన్వీ కపూర్ ఎక్కువగానే కష్టపడుతుంది. అటు ఫస్ట్ తెలుగు సినిమా షూటింగ్ జరుగుతుండగానే.. మరిన్ని ప్రాజెక్ట్స్ లైన్లో పెట్టేసింది. ఇన్నాళ్లు బీటౌన్లో అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగిన ఈ తార.. ఇప్పుడు తెలుగులో బిజీగా హీరోయిన్ కాబోతుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ సరసన దేవర సినిమాలో నటిస్తుంది. మాస్ యాక్షన్ నేపథ్యంలో కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. దేవర సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాబోతున్న జాన్వీ.. ఆ తర్వాత మరిన్ని చిత్రాలతో సందడి చేయబోతుంది. ఇప్పటికే ఆర్సీ 16లో ఛాన్స్ కొట్టేసింది. బుచ్చిబాబు సన, రామ్ చరణ్ కాంబోలో రాబోతున్న కొత్త ప్రాజెక్టులో ఈ బ్యూటీకి ఛాన్స్ వచ్చింది. ఇక తాజాగా జాన్వీకి మరో పెద్ద అవకాశమే వచ్చినట్లుగా తెలుస్తోంది.
ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్న సినిమా పుష్ప 2. గతంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన పుష్ప చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న మూవీ ఇది. కొన్నాళ్లుగా ఈ మూవీ చిత్రీకరణ జోరుగా సాగుతుంది. ఇందులో రష్మిక మందన్నా, సునీల్, ఫహద్ ఫాజిల్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది ఆగస్టులో రిలీజ్ చేయనున్నారు. అయితే పుష్ప ఫస్ట్ పార్టులో ఊ అంటావా సాంగ్ ఏ రేంజ్ రెస్పాన్స్ అందుకుందో చెప్పక్కర్లేదు. ఇందులో నటించిన సమంతకు కూడా ఫాలోయింగ్ మరింత పెరిగింది. ఇక ఇప్పుడు పుష్ప 2లోనూ స్పెషల్ సాంగ్ ఉందనే టాక్ వినిపిస్తుంది. ఈసారి ఈ పాటలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కనిపించనుందని అంటున్నారు.
అయితే ఇప్పుడు వినిపిస్తున్న సమాచారం ప్రకారం పుష్ప 2లో స్పెషల్ సాంగ్ ఛాన్స్ ముందుగా శ్రీలీలకు వచ్చిందట. అయితే అప్పటికే ఆమె వరుస సినిమాలతో బిజీగా ఉండడంతో ఈ ఛాన్స్ వదులుకుందట. దీంతో ఆమె స్థానంలోకి జాన్వీని తీసుకున్నారని తెలుస్తోంది. ఈ సాంగ్ కోసం బాలీవుడ్ తార కియారా అద్వానీని కూడా చిత్రయూనిట్ సంప్రదించిందట. కానీ గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీగా ఉన్న కియారా ఈ సినిమాకు నో చెప్పిందట. ఇక చివరకు ఈపాట కోసం జాన్వీ సెలక్ట్ అయిందని సమాచారం. ఇవే కాకుండా తమిళంలోనూ జాన్వీకి ఆఫర్స్ వస్తున్నట్లుగా తెలుస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.