సాయి పల్లవికి దక్షిణాదిలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రేమమ్ సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఈ మూవీలో మలర్ పాత్రలో కనిపించి ఆకట్టుకుంది. రియలిస్టిక్ యాక్టింగ్ , క్యూట్ స్మైల్ తో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకుంది. అందుకే ఆమెను న్యాచురల్ బ్యూటీ అని పిలుచుకుంటారు అభిమానులు. స్టార్ హీరోయిన్ గా కాకుండా సాధారణ అమ్మాయిగా సింపుల్ లుక్లో కనిపిస్తూ మెస్మరైజ్ చేస్తుంది. అతి తక్కువ మేకప్.. చీరకట్టులో… అందమైన ఉంగరాల జుట్టుతో ఎంతో అందంగా కనిపిస్తుంటుంది. అందుకే ఆమెకు తెలుగు, తమిలం, మలయాళం, కన్నడ భాషల్లో అత్యధిక ఫాలోయింగ్ ఉంది. కానీ సాయి పల్లవి జుట్టు ఆరోగ్య రహస్యం ఏంటో తెలుసా ? .. ఎక్కువ కెమికల్ ప్రొడక్ట్స్ వాడకుండా, జుట్టు మీద ఎక్కువ ప్రయోగాలు చేయకుండా నేచురల్ గా కేర్ తీసుకోవడానికి ఇష్టపడుతుందట.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో సాయి పల్లవి తన జుట్టు సంరక్షణ రహస్యాన్ని బయటపెట్టింది. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడానికి ఇష్టపడతానని.. జంక్ ఫుడ్ లేదా వేయించిన ఆహారాన్ని అసలు తీసుకోనని చెబుతుంది. జుట్టును ప్రతిరోజూ శుభ్రం చేయడానికి ఇష్టపడతానని.. రసాయన షాంపులకు దూరంగా.. కేవంల సహజ పదార్థాలను ఉపయోగిస్తుందట. వీటన్నింటికీ మించి అలోవెరా జెల్ వాడటం వల్ల తన ఒత్తైన జుట్టు ఆరోగ్యంగా ఉంటుందని తెలిపింది.
ఇదిలా ఉంటే.. సాయి పల్లవి ఇంట్లో త్వరలోనే పెళ్లి భజాలు మోగనున్నాయి. ఇటీవలే ఆమె చెల్లెలు పూజా కన్నన్ నిశ్చితార్థం గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకలలో సాయి పల్లవి ఎంతో సింపుల్ గా మరింత అందంగా కనిపించింది. ప్రస్తుతం ఆమె తండేల్ సినిమాలో నటిస్తుంది. ఈ మూవీలో నాగ చైతన్య హీరోగా నటిస్తుండగా.. చందూ మోండేటి దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ అడియన్స్ ముందుకు రానుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.