Megastar Chiranjeevi: చిరంజీవి రిజెక్ట్ చేసిన సినిమాతో సూపర్ హిట్ కొట్టిన రజినీకాంత్.. ఏ మూవీ అంటే..

|

Oct 18, 2024 | 10:00 AM

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర మూవీ చిత్రీకరణలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా అడియన్స్ ముందుకు రాబోతుంది. మరోవైపు వెట్టాయాన్ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నారు రజినీ. కానీ చిరు రిజెక్ట్ చేసిన సినిమాతో తలైవా సూపర్ హిట్ అందుకున్నారని తెలుసా.. ? ఆ సినిమా ఏంటో చూద్దాం.

Megastar Chiranjeevi: చిరంజీవి రిజెక్ట్ చేసిన సినిమాతో సూపర్ హిట్ కొట్టిన రజినీకాంత్.. ఏ మూవీ అంటే..
Rajinikanth, Chiranjeevi
Follow us on

మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి టాప్ హీరోగా ఎదిగిన తీరు ఎందరికో ఆదర్శం. సినీరంగంలో తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని ఆరాటపడే నటీనటులకు చిరు స్పూర్తి. ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు, వైవిధ్యమైన పాత్రలతో తనదైన నటన అడియన్స్ హృదయాల్లో చెరగని చోటు సంపాదించుకున్నారు. కానీ చిరంజీవి కూడా కొన్ని హిట్ చిత్రాలను కొద్దిలో మిస్సయ్యారు. సినీరంగంలో ఓ హీరో కోసం డైరెక్టర్స్ కథలు రాసుకుంటారు. కానీ అనుకోకుండా మరో హీరోతో ఆ చిత్రాన్ని రూపొందిస్తారు. అలాగే మెగాస్టార్ వదిలేసుకున్న సినిమాతో సూపర్ స్టార్ రజినీకాంత్ భారీ విజయాన్ని అందుకున్నారు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాసింది. ఇంతకీ ఆ సినిమా ఏదంటే.. చంద్రముఖి.

అవును.. చిరంజీవి రిజెక్ట్ చేసిన సినిమాతో రజినీకాంత్ రికార్డులు తిరగరాశాడు. చంద్రముఖి సినిమా ముందుగా చిరంజీవి వద్దకే వచ్చింది. దర్శకుడు ఈ సినిమా చూడాలని చిరుకు సూచించగా.. కన్నడ వర్షన్ చూసిన చిరు వద్దనుకుని పక్కనపెట్టారు. ఆ సినిమా మలయాళీ సూపర్ హిట్ ముణిచిత్రకు రీమేక్. ఇందులో శోభన ప్రధాన పాత్రలో నటిచంగా.. సురేష్ గోపి హీరోగా నటించారు. ఇదే కథను 2003లో ఆప్తమిత్ర పేరుతో కన్నడలో తెరకెక్కించారు. అందులో ప్రధాన పాత్రలో సౌందర్య నటించింది.

ఇది చదవండి : Bhadra Movie: వార్నీ.. ఏం ఛేంజ్ భయ్యా..’భద్ర’ మూవీలో రవితేజ మరదలు.. ఇప్పుడు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే..

ఇక ఇదే సినిమాను తమిళంతోపాటు తెలుగులోనూ ఏకకాలంలో తెరకెక్కించాలనుకున్నారు. జ్యోతిక కథానాయికగా.. రజినీకాంత్ హీరోగా నటించారు. కథానాయికగా నయనతార నటించగా..ప్రభు, సోనూ సూద్ కీలకపాత్రలు పోషించారు. 2005లో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. తెలుగుతోపాటు తమిళంలోనూ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ సునామి సృష్టించింది.

ఇది చదవండి :

Bhadra Movie: వార్నీ.. ఏం ఛేంజ్ భయ్యా..’భద్ర’ మూవీలో రవితేజ మరదలు.. ఇప్పుడు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే..

Actress Laya: అందంలో అమ్మను మించిపోయిన డాటర్.. హీరోయిన్ లయ కూతురిని చూశారా..?

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.