
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటులలో మహేష్ బాబు ఒకరు. నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న మహేష్.. అతని ఫిట్, టోన్డ్ ఫిజిక్‌తో ఎప్పటికప్పుడు అభిమానులను ఆశ్చర్యపరుస్తుంటారు. ఇక స్టైలీష్ అండ్ డాషింగ్ లుక్‌లో మహేష్ షేర్ చేసే ఫోటోస్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరలవుతుంటాయి. భారతీయులే కాదు.. విదేశాల్లోనూ మహేష్ బాబుకు ఫాలోయింగ్ ఓ రేంజ్లో ఉంది. ఇటీవల షేర్ చేసిన ఫోటోలలో మహేష్ మరింత స్టైలీష్ గా 25 ఏళ్ల యువకుడిగా కనిపిస్తున్నారు. ఈ స్టార్ హీరో తన ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడానికి అనుసరించే వర్కవుట్, డైట్ ప్లాన్స్ గురించి తెలుసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. అందుకే ఇప్పుడు ఒకసారి మహేష్ బాబు ఫిట్‌నెస్ సీక్రెట్స్ తెలుసుకుందాం.
గతంలో మహేష్ తన ఇన్ స్టాలో బ్రేక్ ఫాస్ట్ చేస్తున్న ఫోటో పంచుకున్నారు. అందులో ఉదయాన్నే మహేష్.. రాత్రిపూట నానబెట్టిన విత్తనాలు, ఓట్స్ తో చేసిన ఆహారం తీసుకుంటున్నారు. అలాగే రోజూ కఠినమైన వర్కవుట్స్ చేస్తుంటారు. ఫిట్ నెస్ కోసం మహేష్ రోజూ.. రన్నింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, వెయిట్ లిఫ్టింగ్, ఫంక్షనల్ ట్రైనింగ్ వంటి వ్యాయామాలు చేస్తుంటారు. అలాగే యోగా, ధ్యానం చేస్తుంటారు.
మహేష్ బాబు డైట్ ప్లాన్..
ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడానికి మహేష్ బాబు కఠినమైన డైట్ ప్లాన్‌ను పాటిస్తున్నాడు. ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు వంటి అన్ని అవసరమైన పోషకాలను కలిగి ఉన్న సమతుల్య ఆహారాన్ని తీసుకుంటారని తెలుస్తోంది. అలాగే ప్రాసెస్ చేసిన జంక్ ఫుడ్ కు దూరంగా ఉంటారు. కేవలం ఇంట్లో చేసిన ఆహారపదార్థాలను మాత్రమే తీసుకుంటారు. తన ఆహారంలో లీన్ మాంసాలు, చేపలు, కూరగాయలు, పండ్లు, మొలకెత్తిన విత్తనాలు ఉండేలా చూసుకుంటారు. అలాగే నీరు ఎక్కువగా తీసుకుంటారని తెలుస్తోంది. మహేష్ ఎప్పుడూ తన జిమ్ వర్కవుట్స్ ఫోటోస్ సైతం షేర్ చేస్తుంటారు.
ప్రస్తుతం మహేష్ బాబు గుంటూరు కారం షూటింగ్ లో బిజీగా ఉన్నారు. డైరెక్టర్ త్రివిక్రమ్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో మహేష్ జోడిగా మీనాక్షి చౌదరి, శ్రీలీల నటిస్తున్నారు. ఈ సినిమాలో జగపతి బాబు కీలకపాత్ర పోషిస్తున్నారు. కొన్నాళ్లుగా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో పనిచేయనున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.