
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటన గురించి, ఆయన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తారక్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా రాణిస్తున్నారు తారక్. ఆర్ఆర్ఆర్ సినిమాతో దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తారక్ కు జపాన్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో పాటు కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన దేవర సినిమా కూడా జపాన్ లో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. కాగా ఇటీవల వార్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు తారక్. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఇక ఇప్పుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు తారక్.
అయితే ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో నటించిన మొదటి సినిమా ఎదో తెలుసా.? తొలిసారి ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో నటించడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోయారు. కానీ సినిమా విడుదలైన తర్వాత ఫ్లాప్ అయ్యింది. ఆ సినిమా ఎదో తెలుసా.? ఆ సినిమా ఆడియో ఫంక్షన్ కు ఏకంగా పది లక్షల మందికి పైగా అభిమానులు వచ్చారు. ఆ సినిమా మరేదో కాదు ఆంధ్రావాలా
పూరిజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. 2004లో విడుదలైన ఆంధ్రావాలా. ఈ సినిమాలో తారక్ డ్యూయల్ రోల్ లో నటించారు. కానీ ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ కు భారీగా ఫ్యాన్స్ హాజరయ్యారు. ఏకంగా నాలుగు ప్రత్యేక రైళ్లను కూడా ఏర్పాటు చేశారు. దాదాపు 10లక్షలకు పైగా హాజరయ్యారు ఆ ఈవెంట్ కు. కాగా ఇప్పుడు ఆంధ్రావాలా సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రం విడుదలై 22 ఏళ్లు దాటింది. ఈ సందర్భంగా ఈ నెల 26న రీ రిలీజ్‌కి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. త్వరలోనే దీని పై క్లారిటీ ఇవ్వనున్నారు. దాంతో ఫ్యాన్స్ మరోసారి ఈ సినిమాను థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయడానికి రెడీ అవుతున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.