
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ఆయన రేంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ ను ఆయన అభిమానులు కేవలం హీరోగానే చూడరు ఒక దేవుడిగా భవిస్తూ ఉంటారు. అందుకే ఆయనకు ఫ్యాన్స్ కన్నా భక్తులు ఎక్కువ. ఇక పవన్ సినిమా వస్తుందంటే చాలు ఒక పండగ వచ్చినట్టే.. థియేటర్స్ దగ్గర రచ్చ జరగాల్సిందే.. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురవాల్సిందే.. పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ కు.. ఆయన స్టైల్ కు ఫిదా కానీ ప్రేక్షకుడు ఉండరు. ఇక పవన్ కళ్యాణ్ నటించిన సినిమాల్లో అన్ని పాటలు సూపర్ హిట్స్ గా నిలుస్తాయి. పవన్ సినిమాల్లో ప్రత్యేకంగా చెప్పుకునే సినిమాల్లో గుడుంబా శంకర్ మూవీ ఒకటి. ఈ సినిమాలో పవర్ స్టార్ ప్యాంట్ మీద ప్యాంట్ వేసి నయా ట్రెండ్ క్రియేట్ చేశారు.
గుడుంబా శంకర్ సినిమా టీవీలో టెలికాస్ట్ అయితే ఇప్పటికి ప్రేక్షకులు కదలకుండా సినిమా మొత్తం చేసేస్తారు. ఇక ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ ప్రేక్షకులను ఉర్రుతలుగుంచింది. కిళ్లీ కిళ్లీ అంటుసాగే ఈ పాటలో పవన్ డ్యాన్స్ యాటిట్యూడ్ ఆకట్టుకున్నాయి. అయితే ఈ పాటలో పవన్ తో చిందులేసిన అమ్మడు గుర్తుందా..?
ఆ అమ్మడు పేరు నతాన్య సింగ్. గుడుంబా శంకర్ సినిమా తర్వాత మరో తెలుగు సినిమాలో కనిపించలేదు అనుకోకండి. మోహన్ బాబు నటించిన శివ శంకర్ అనే సినిమా చేసింది. కానీ కన్నడ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. 2008 వ సంవత్సరం లో ఉపేంద్ర హీరో గా నటించిన ‘బుద్దివంత’ చిత్రమే ఈమెకి ఆఖరి చిత్రం. ఆ తర్వాత మళ్ళీ ఈమె సినిమాల్లో కనిపించలేదు. తాజాగా ఈ అమ్మడి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ భామ హాట్ హాట్ ఫోటోలు నెట్టింట సెగలు పుట్టిస్తున్నాయి.
Natanya Singh