
అల్లరి సినిమా మీకు గుర్తుందా..? ప్రముఖ దర్శక నిర్మాత ఈవీవీ సత్యనారాయణ రెండో కొడుకు నరేష్ ఈ చిత్రం ద్వారా టాలీవుడ్ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. తన మొదటి చిత్రం టైటిల్‌ను ఇంటిపేరుగా మార్చుకుని.. ఆ తర్వాత ‘అల్లరి’ నరేష్‌గా స్థిరపడిపోయాడు. ఇక ‘అల్లరి’ సినిమాకు దర్శకుడు రవిబాబు. ఈ చిత్రంలో శ్వేతా అగర్వాల్, నీలాంబరి హీరోయిన్లుగా నటించారు. అల్లరి నరేష్‌కు ఫ్రెండ్ క్యారెక్టర్‌లో అప్పుగా నటించిన నటి శ్వేతా అందరికీ గుర్తుండిపోతుంది.
తనదైన క్యూట్ లుక్స్‌తో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. ఈ ముంబై భామకు తెలుగులో ఇది తొలి సినిమా కాగా.. ఆ తర్వాత ప్రభాస్ హీరోగా వచ్చిన ‘రాఘవేంద్ర’లో మహాలక్ష్మీగా నటించి మెప్పించింది. ఈమె నటించింది 7 సినిమాలే.. కానీ తెలుగుతో పాటు మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఈ బ్యూటీ చివరిసారిగా 2008లో శర్వానంద్, అల్లరి నరేష్ హీరోలుగా వచ్చిన ‘గమ్యం’ సినిమా చేసింది. అలాగే హిందీలో 2010లో ‘శపిట్’ అనే చిత్రంలో నటించింది.
ఇక ఈమె వైవాహిక జీవితం విషయానికొస్తే.. శ్వేతా అగర్వాల్ 2020లో ఉదిత్ నారాయణ్ కొడుకు ఆదిత్య నారాయణ్‌ను వివాహమాడింది. ఈ జంటకు 2022లో ఓ పాప జన్మించింది. దాదాపు 15సంవత్సరాల నుంచి సినిమాలకు దూరంగా ఉన్న ఈ భామ.. ప్రస్తుతం తన లైఫ్‌ను కుటుంబ సభ్యులతో హ్యాపీగా లీడ్ చేస్తోంది. పెళ్లి తర్వాత పూర్తిగా మారిపోయిన ఈ బ్యూటీని.. ఇప్పుడు చూస్తే అస్సలు గుర్తుపట్టలేరు. కాగా, ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి .