వార్ని..! ఏంటి.. ఈ బ్యూటీ చంద్రముఖిలోని చిన్నారా..!! చూస్తే షాక్ అవ్వాల్సిందే
సోషల్ మీడియాలో చాలా మంది హీరోయిన్స్ కు సంబందించిన చిన్ననాటి ఫోటోలతో పాటు లేటెస్ట్ ఫోటోలు కూడా వైరల్ గా మారుతాయి. ఈ క్రమంలోనే ఓ చిన్నదాని ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ చిన్నది ఎవరో కాదు సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన సూపర్ హిట్ మూవీ చంద్రముఖి సినిమాలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్.

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్ లుగా నటించి ఆతర్వాత హీరోయిన్స్ గా మారిన వాళ్ళు ఉన్నారు. ఆతర్వాత ఇండస్ట్రీకి దూరమైన వారు కూడా ఉన్నారు. సోషల్ మీడియాలో చాలా మంది హీరోయిన్స్ కు సంబందించిన చిన్ననాటి ఫోటోలతో పాటు లేటెస్ట్ ఫోటోలు కూడా వైరల్ గా మారుతాయి. ఈ క్రమంలోనే ఓ చిన్నదాని ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ చిన్నది ఎవరో కాదు సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన సూపర్ హిట్ మూవీ చంద్రముఖి సినిమాలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్. తలైవర్ రజినీకాంత్ బ్లాక్ బస్టర్స్ చిత్రాల్లో ఒకటి చంద్రముఖి. హరర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. పి వాసు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో జోతిక చంద్రముఖిగా నటించింది.
బాబా లాంటి ఫ్లాప్ సినిమా తర్వాత సూపర్ నటించిన సినిమా చంద్రముఖి. ఈ సినిమాతోనే లేడీ సూపర్ స్టార్ నయనతార పరిచయం అయ్యారు. చంద్రముఖి సినిమాలో నయనతార మ్యూజిక్ టీచర్ గా కనిపించిది. నయన్ స్టూడెంట్ గా నటించిన ఆ చిన్నారి ఇప్పుడు హీరోయిన్ గా మారిపోయింది. అప్పుడు బొద్దుగా ముద్దుగా ఉన్న ఆ చిన్నారి ఇప్పుడు స్టైలిష్ లుక్ లోకి మారి అదరగొడుతోంది.
ఆ పాప పేరు ప్రహర్షిత. ఈ చిన్నది వేలన్, రాజ రాజేశ్వరి, సెల్వీ లాంటి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. కానీ అనూహ్యంగా సినిమాలకు దూరం అయ్యింది ఈ బ్యూటీ. 2021లో పెళ్లి చేసుకుంది. ఆమెకు ఓ కూతురు కూడా ఉంది. చాలా కాలం తర్వాత ఇప్పుడు ఈ చిన్నది సీరియల్స్ లో నటిస్తుంది. సుమారు 18 ఏళ్ల తర్వాత ఈ బ్యూటీ కెమెరాముందుకు వచ్చింది. తమిళ సీరియల్ తాయమ్మ కుడుంబత్తార్ అనే సీరియల్ లో నటిస్తుంది ప్రహర్షిత. ఇక సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ అమ్మడు. ఈ క్రమంలో ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




