బాబోయ్.. బంగారం సినిమా చిన్నారి బీభత్సంగా మారిపోయిందిగా..!

|

Jun 17, 2024 | 8:34 PM

ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ స్టైల్, ఆయన స్వాగ్ ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నాయి. అలాగే ఈ సినిమాలో పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పటికీ బంగారం సినిమాలోని సాంగ్స్ వినిపిస్తూనే ఉంటాయి. 2006లో వచ్చిన బంగారం సినిమాకు ధరణి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన మీరా చోప్రా నటించింది. అదేవిధంగా ఈ మూవీలో పవన్ జర్నలిస్టు గా కనిపించి ఆకట్టుకున్నారు.

బాబోయ్.. బంగారం సినిమా చిన్నారి బీభత్సంగా మారిపోయిందిగా..!
Bangaram
Follow us on

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా ఫ్యాన్స్ సినిమాను ఎంజాయ్ చేస్తుంటారు. అలా ప్రేక్షకులను ముఖ్యంగా ఫ్యాన్స్ ను ఎంటర్టైన్ చేసిన సినిమాల్లో బంగారం సినిమా ఒకటి. ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ స్టైల్, ఆయన స్వాగ్ ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నాయి. అలాగే ఈ సినిమాలో పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పటికీ బంగారం సినిమాలోని సాంగ్స్ వినిపిస్తూనే ఉంటాయి. 2006లో వచ్చిన బంగారం సినిమాకు ధరణి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన మీరా చోప్రా నటించింది. అదేవిధంగా ఈ మూవీలో పవన్ జర్నలిస్టు గా కనిపించి ఆకట్టుకున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ సిస్టర్ గా నటించిన అమ్మాయి గుర్తుందా.?

ఆమె పేరు సనూష సంతోష్ ఈ చిన్నది తమిళ్ లో పలు సినిమాలు చేసి ఆకట్టుకుంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో నటించింది ఈ చిన్నది. ఇక బంగారం సినిమాలో హీరోయిన్ సిస్టర్ వింధ్య పాత్రలో ఆకట్టుకుంది. ఇక ఈ చిన్నది ఇప్పుడు ఎలా ఉంది.? ఎం చేస్తుంది. అని చాలా మంది గూగుల్ లో గాలిస్తున్నారు. అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు హీరోయిన్ గా మారిపోయింది. తెలుగులో జీనియస్, జెర్సీ సినిమాల్లో నటించింది.

నటిగా తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో నటించింది సనూష సంతోష్. అలాగే పలు టీవీ షోల్లోనూ కనిపించి ఆకట్టుకుంది. అలాగే సోషల్ మీడియాలోనూ ఈ ముద్దుగుమ్మ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ప్రస్తుతం ఈ అమ్మడు విదేశాల్లో ఎంజాయ్ చేస్తుంది. రెగ్యులర్ గా అక్కడి నుంచి ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులకు ఆకట్టుకుంటుంది ఈ వయ్యారి భామ. ఈ అమ్మడి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ చిన్నదాని ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.

సనూష సంతోష్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

సనూష సంతోష్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.