పవర్ స్టార్ పవన్ కళ్యణ్ నటించిన బంగారం సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అభిమానులను ఆకట్టుకున్న ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేక పోయింది. బంగారం సినిమాలో పాటలన్ని సూపర్ హిట్ గా నిలిచాయి. మీరాచోప్రా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు ధరణి దర్శకత్వం వహించారు. ఈ సినిమా 2006లో రిలీజ్ అయ్యింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ మూవీ ఆ అంచనాలను అందుకోలేకపోయింది . ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ చెల్లిగా నటించిన చిన్నారి గుర్తుందా..? ఆ చిన్నారి పేరు సనూషా. అయితే ఇప్పుడు ఆ చిన్నది ఎలా ఉందో తెలుసా..? ఏం చేస్తుందో తెలుసా..?
సనూష ఇప్పుడు నటిగా మారింది. ఆమె పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటించింది. నాని నటించిన జెర్సీ సినిమాలో నటించింది సనూష సంతోష్. ఆమె మలయాళంలో చాలా సినిమాల్లో నటించింది . బంగారం సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టింది.
బంగారం సినిమా తర్వాత మేధావి అనే సినిమా చేసింది . ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. చివరిగా జెర్సీ సినిమాలో చేసింది. తాజాగా ఈ అమ్మడి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆమె హీరోయిన్ కు ఏమాత్రం తీసిపోని అందంతో ఆకట్టుకుంటుంది ఈ చిన్నది. ఆమె లేటెస్ట్ ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి.