Kick : కేకపెట్టించిన కిక్ భామ.. అప్పటికంటే ఇప్పుడు యమా హాట్ గురూ..!

|

Oct 29, 2024 | 12:30 PM

అప్పుడెప్పుడో వచ్చిన రాజా ది గ్రేట్ సినిమా తర్వాత రవితేజ ఆ రేంజ్ హిట్ అందుకోలేకపోయారు. చివరిగా వచ్చిన మిస్టర్ బచ్చన్ సినిమా పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు కానీ..

Kick : కేకపెట్టించిన కిక్ భామ.. అప్పటికంటే ఇప్పుడు యమా హాట్ గురూ..!
Kick
Follow us on

మాస్ మహారాజ రవితేజ సినిమా అంటే మినిమమ్ ఎంటర్టైమెంట్ గ్యారెంటీ.. కాకపోతే ఈ ఆమధ్య ఆయన నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ సాదించడం లేదు. అప్పుడెప్పుడో వచ్చిన రాజా ది గ్రేట్ సినిమా తర్వాత రవితేజ ఆ రేంజ్ హిట్ అందుకోలేకపోయారు. చివరిగా వచ్చిన మిస్టర్ బచ్చన్ సినిమా పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు కానీ ఆ సినిమా కూడా ప్రేక్షకులను నిరాశపరిచింది. రవితేజ కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. వాటిలో కిక్ సినిమా ఒకటి. 2009 లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

ఇది కూడా చదవండి : బుర్రపాడవ్వల్సిందే..! రాజారాణిలో కనిపించింది ఈమేనా..! ఇది అస్సలు ఊహించలేదు గురూ..!

కిక్ సినిమాలో రవితేజకు జోడీగా ఇలియానా నటించింది. ఇక ఈ సినిమాలో తమిళ్ నటుడు శ్యామ్ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా తర్వాత ఆయన పేరు కిక్ శ్యామ్ గా మారింది. ఇక ఈ కిక్ సినిమాలో బ్రహ్మానందం, రవితేజ మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. కిక్ సినిమాలోని ప్రతి సీన్, ప్రతి క్యారెక్టర్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. కాగా ఈ సినిమాలో ఇలియానా సిస్టర్ గా నటించిన అమ్మడు గుర్తుందా..!

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : Jr.NTR : ఎన్టీఆర్‌ను చూసి కన్నీళ్లు పెట్టుకున్న నటి సుహాసిని.. ఆసక్తికర విషయం చెప్పిన దర్శకుడు

ఈ సినిమాలో ఆమె కనిపించేది కొద్దిసేపే అయినా తన అందంతో ఆకట్టుకుంది ఆ భామ. కిక్ సినిమాలో రవితేజను ఇష్టపడే అమ్మాయిగా కనిపిస్తుంది ఆ చిన్నది. ఆమె పేరు ఆషీకా బతిజా. కిక్ సినిమాలో మెరిసిన ఈ చిన్నది ఆతర్వాత అంతగా అవకాశాలు అందుకోలేకపోయింది. కిక్ సినిమా తర్వాత చదువు పై దృష్టి పెట్టింది. అలాగే లండన్ లో స్టడీ పూర్తి చేసిన ఈ భామ.. ఆతర్వాత మోడలింగ్ లోకి అడుగుపెట్టి అందులోనే స్థిరపడిపోయింది. కాగా ఇప్పుడు ఆమె ఎలా ఉంది.? ఎక్కడ ఉంది.? అంటూ నెటిజన్స్ గూగుల్ ను గాలిస్తున్నారు.  ఆషీకా బతిజా పెళ్లి చేసుకొని విదేశాల్లో సెటిల్ అయ్యింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.