రీతూ చౌదరి ఎలిమినేషన్.. రెమ్యునరేషన్ అంత అందుకుందంటే.. అందరికంటే ఎక్కువ

బిగ్ బాస్ తెలుగు 13వ వారం ఎలిమినేషన్లో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఎవరూ ఊహించని విధంగా రీతూ చౌదరి ఎలిమినేట్ అయింది. ఈవారం హౌస్ నుంచి ఆమెనే బయటికి పంపించారు. ఇక లెక్క ప్రకారం.. ఆన్ లైన్ పోల్స్ , యూట్యూబ్ పోల్స్.. వారం మొత్తం జరిగిన ఆటతీరు వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే.. నామినేషన్స్‌లో ఉన్న ఆరుగురిలో ..సుమన్ శెట్టి లేదంటే.. సంజనా ఎలిమినేట్ కావాల్సి ఉంది.

రీతూ చౌదరి ఎలిమినేషన్.. రెమ్యునరేషన్ అంత అందుకుందంటే.. అందరికంటే ఎక్కువ
Rithu Chowdary

Updated on: Dec 08, 2025 | 2:08 PM

బిగ్ బాస్ సీజన్ 9 చివరి అంకానికి వచ్చేసింది. మరో 15 రోజుల్లో సీజన్ పూర్తికానుంది. ఇక ఇప్పటివరకు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ మంచి టీఆర్పీ సొంతం చేసుకుంది బిగ్ బాస్ షో. ఇక వారాంతం వచ్చిందంటే చాలు కింగ్ నాగార్జున ఎంట్రీ ఇచ్చి హౌస్ మేట్స్ తో గేమ్స్ ఆడించి ఆతర్వాత ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తి చేస్తారు. వారం వారం ఒకొక్కరు హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేస్తున్నారు. కాగా నిన్నటి ఎపిసోడ్ లో ఊహించని విధంగా రీతూ చౌదరి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది. టాప్ 5లో ఉంటుందని అందరూ అనుకున్నారు.. కానీ ఆమె ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది.

బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి తన అందం, ఆట, అల్లరితో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది రీతూ చౌదరి. ప్రతివారం ఓటింగ్ లోనూ టాప్ లో దూసుకుపోయింది. బిగ్ బాస్డ్ హౌస్ లో డీమన్ పవన్ తో ప్రేమాయణం సాగించిన రీతూ.. అతనితో రాసుకుపూసుకు తిరుగుతూ బిగ్ బాస్ కు కావాల్సినంత కంటెంట్ ఇచ్చింది. గత కొన్ని వారల నుంచి టాస్క్ ల్లోనూ ఆమె దుమ్మురేపింది. కానీ  ఊహించని విధంగా ఎలిమినేట్ అయ్యింది. ఇక రీతూ చౌదరి 13 వారాల పాటు తన గేమ్‌ అందరిని ఆకట్టుకుంటుంది. రీతూ చౌదరికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే..

ఇవి కూడా చదవండి

ఇక 13వ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన రీతూ చౌదరి ఎంత సంపాదించిందో తెలుసా..? రీతూ చౌదరికి బిగ్ బాస్ ద్వారా బాగానే రెమ్యునరేషన్ అందిందని తెలుస్తుంది. వారానికి రూ. 2.50 లక్షల రెమ్యూనరేషన్ అందుకున్నట్లు సమాచారం. దాంతో 13 వారాలకు గానూ మొత్తంగా రూ. 32 లక్షల మేరకు రెమ్యునరేషన్‌గా అందుకుందని టాక్ వినిపిస్తుంది. మొత్తంగా బిగ్ బాస్ విన్నర్ రేంజ్ లో బాగానే సంపాదించిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి