సినిమా రంగానికి సంబంధించి దేశంలో నేషనల్ ఫిల్మ్స్ అవార్డులను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారు. ఏటా ప్రదానం చేసే ఈ పురస్కారాలను అందుకోవాలని వివిధ సినిమా పరిశ్రమలకు చెందిన నటీనటులు ఆరాటపడుతుంటారు. తాజాగా 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతలను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్ వేదికగా గురువారం (ఆగస్టు 25) సాయంత్రం ఈ పురస్కారాల విజేతలను ప్రకటించారు. గత కొన్నేళ్లుగా సినిమా ఇండస్డ్రీ రికార్డులు కొల్లగొడుతోన్న తెలుగు సినిమాలు జాతీయ అవార్డుల్లోనూ సత్తా చాటాయి. పుష్ప సినిమాకు అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడు అవార్డుకు ఎంపికై, ఈ ఘనత సాధించిన తొలి తెలుగు నటుడిగా చరిత్ర సృష్టించాడు. ఇక దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్ సినిమా ఏకంగా ఆరు పురస్కారాలు సొంతం చేసుకుంది. అలాగే పుష్ప సినిమాలు రెండు అవార్డులు గెల్చుకుంది. ఉప్పెన, కొండపొలం సినిమాలకు కూడా పురస్కారాలు వచ్చాయి. జాతీయ చలనచిత్ర అవార్డులు గెల్చుకున్న వారికి ఏమేమి ఇస్తారు? నగదు బహుమతి ఎంత ప్రదానం చేస్తారు? పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి.
జాతీయ చలనచిత్ర అవార్డు విజేతలకు విభాగాల వారీగా స్వర్ణ కమలం, రజత కమలంతో పాటు ప్రైజ్ మనీ కూడా ఇస్తారు. అలాగే ప్రశంసా పత్రాలు కూడా అందిస్తారు. అవార్డు విజేతలందరికీ ప్రశంసా పత్రాలు అందజేస్తారు.. కొన్ని ముఖ్యమైన విభాగాల్లో అవార్డు గ్రహీతలకు నగదు బహుమతితో పాటు స్వర్ణ కమలాన్ని ప్రదానం చేస్తారు. కొన్ని విభాగాలకు రజత కమలం అందజేస్తారు. జ్యూరీ మెచ్చుకున్న సినిమాలకు కేవలం సర్టిఫికెట్ మాత్రమే ఇస్తారు. జ్యూరీ ప్రత్యేక బహుమతి విజేతలకు నగదు బహుమతి లభిస్తుంది. ఇక ఉత్తమ నటుడు, నటి సహా అవార్డులు పొందిన నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ రజత కమలంతో పాటు రూ.50,000 నగదు బహుమతిని అందజేయనున్నారు. అంటే ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకున్న అల్లు అర్జున్, అలాగే బెస్ట్ యాక్ట్రెస్ అవార్డును గెలుచుకున్న అలియా భట్, కృతి సనన్‌లకు కూడా ఒక్కొక్కరికి 50 వేల రూపాయలు అందజేయనున్నారు. ఇక ఉత్తమ ఎడిటింగ్, సౌండ్ డిజైన్, మేకప్, కాస్ట్యూమింగ్, ఇతర కేటగిరీల విజేతలకు కూడా అదే మొత్తంలో డబ్బును అందజేస్తారు. అయితే ఉత్తమ దర్శకుడు అవార్డును గెలుచుకున్న నిఖిల్ మహాజన్‌కు మాత్రం 2.50 లక్షల నగదు బహుమతి లభిస్తుంది.
#WATCH |Telangana | After winning the Best Actor Award for ‘Pushpa: The Rise’ at #69thNationalFilmAwards, actor Allu Arjun greets fans and celebrates at his residence in Hyderabad.
(Source: Allu Arjun’s team) pic.twitter.com/d6No6BK4ao
— ANI (@ANI) August 24, 2023
ఇక ఉత్తమ చిత్రంగా అవార్డు పొందిన ‘రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్’ చిత్రానికి రూ.2.50 లక్షల నగదు, బంగారు కమలం అందజేయనున్నారు. ఉత్తమ వినోద విభాగంలో అవార్డు గెలుచుకున్న ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రానికి 2 లక్షల నగదు, బంగారు కమలం అందజేయనున్నారు. జ్యూరీ ప్రత్యేక అవార్డు పొందిన ‘షేర్షా’ చిత్రానికి 2 లక్షల నగదు, రజత కమలం, జాతీయ సమగ్రత విభాగంలో గెలుపొందిన ‘ది కాశ్మీర్ ఫైల్స్’ చిత్రానికి 1.50 లక్షల నగదు, రజత కమలం. ఉత్తమ బాలల చిత్రం, ఉత్తమ పర్యావరణ సంబంధిత చిత్రం, సామాజిక సందేశంతో కూడిన చిత్రం విభాగాల్లో గెలుపొందిన చిత్రాలకు రూ.1.50 లక్షల నగదు, రజత కమలం అందజేస్తారు.
#69thNationalFilmAwards #KadaisiVivasaayi @VijaySethuOffl @alluarjun @ActorMadhavan @RRRMovie @ssrajamouli @ThisIsDSP @shreyaghoshal pic.twitter.com/UNpEIZirLS
— Kamal Haasan (@ikamalhaasan) August 25, 2023
నాన్ ఫీచర్ కేటగిరీలో ఉత్తమ చిత్రానికి రూ. 1.50 లక్షల నగదు, బంగారు కమలం అందజేస్తారు. ఉత్తమ దర్శకుడి విభాగంలో అవార్డు గ్రహీతలకు 1.50 లక్షల నగదు కూడా అందజేస్తారు. జ్యూరీ ప్రత్యేక అవార్డును గెలుచుకున్న నాన్-ఫీచర్ ఫిల్మ్‌కి లక్ష, ఉత్తమ నూతన దర్శకుడికి 75 వేలు, ఉత్తమ సినిమా పుస్తకానికి 75 వేలు, ఉత్తమ మూవీ రివ్యూ కేటగిరీకి 75 వేలు ప్రదానం చేస్తారు. ఇక నాన్-ఫీచర్ విభాగంలో అవార్డు గెలుచుకున్న ఇతర సాంకేతిక నిపుణులు, నటీనటులందరికీ 50 వేల రూపాయల బహుమతితో పాటు రజత కమలం ఇస్తారు. ఇక డిస్కవరీ ఫిల్మ్ విభాగంలో అవార్డు గెలుచుకున్న కన్నడ చిత్రం ఆయుష్మాన్ కూడా 50,000 వేల నగదు బహుమతిని అందుకోనుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.