Mogali Rekulu: మొగలిరేకులు సీరియల్‌ బ్యూటీ దేవి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..? చూస్తే షాక్ అవ్వాల్సిందే

|

Mar 28, 2023 | 4:01 PM

చిన్న పెద్ద తేడాలేకుండా ప్రతిఒక్కరిని ఆకట్టుకున్న సీరియల్స్ లిస్ట్ లో ముందువరుసలో ఉండేది మొగలిరేకులు సీరియల్. అప్పట్లో ఈ సీరియల్ కు విపరీతమైన క్రేజ్ ఉండేది.

Mogali Rekulu: మొగలిరేకులు సీరియల్‌ బ్యూటీ దేవి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..? చూస్తే షాక్ అవ్వాల్సిందే
Mogalirekulu
Follow us on

టీవీ సీరియల్స్ అంటే మగువలకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే చాలా టీవీ సీరియల్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అయితే చిన్న పెద్ద తేడాలేకుండా ప్రతిఒక్కరిని ఆకట్టుకున్న సీరియల్స్ లిస్ట్ లో ముందువరుసలో ఉండేది మొగలిరేకులు సీరియల్. అప్పట్లో ఈ సీరియల్ కు విపరీతమైన క్రేజ్ ఉండేది. అయితే ఈసీరియల్ లో  18 ఫిబ్రవరి 2008న మొదలై  24 మే 2013 వరకు సాగింది ఈ సీరియల్. ఈ సీరియల్ కు మంజుల నాయుడు దర్శకత్వం వహించగా బిందు నాయుడు కథను రచించారు. ఈసీరియల్ లో సాగర్ , షీలా,  ఇంద్రనీల్ అలాగే  మేధ ప్రధాన పాత్రల్లో నటించారు. వీరితో పాటే పై ఫొటోలో కనిపిస్తున్న భామ కూడా నటించింది. ఆమె పేరు లిఖిత కామిని.

చూడచక్కని రూపంతో ఆకట్టుకుంది ఈ చిన్నది. అచ్చం హీరోయిన్ లా ఉండే లిఖిత ఆ సీరియల్ లో మెయిన్ రోల్ లో నటించింది.  చాలా ఎపిసోడ్స్ వరకు ఆమె కంటిన్యూ అయ్యింది. ఆ తర్వాత ఆమె స్థానంలో మరో నటి వచ్చింది.

మొగలి రేకులు సీరియల్ లో సాగర్, లిఖిత మధ్య లవ్ ఎపిసోడ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే లిఖిత ఇప్పుడు ఎలా ఉందో తెలుసుకోవడానికి నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా ఈ అమ్మడికి సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి . వివాహం తర్వాత లిఖిత యాక్టింగ్ కు దూరం అయ్యింది. సోషల్ మీడియాలోనూ ఈ అమ్మడు యాక్టివ్ గా ఉండదు.

Likitha

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.