Keerthi Chawla: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.? చూస్తే షాక్ అయిపోతారు
ఇప్పుడు మరో హీరోయిన్ గురించి ఆరా తీస్తున్నారు కొందరు. ఆ హీరోయిన్ ఎవరో కాదు యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఆది మూవీ హీరోయిన్. ఆది సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన సవసరం లేదు.
సినిమా తరాలకు సంబంధించిన ఫొటోస్ పై నెటిజన్స్ స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఇప్పటికే హీరోయిన్స్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే గతంలో స్టార్ హీరోల సరసన నటించి కనుమరుగైన హీరోయిన్స్ గురించి కూడా గూగుల్‌ను గాలించేస్తున్నారు కొందరు. ఈ క్రమంలోనే చాలా మంది హీరోయిన్స్ గురించి ఆసక్తికర విషయాలు తెలుస్తున్నాయి. ఇక ఇప్పుడు మరో హీరోయిన్ గురించి ఆరా తీస్తున్నారు కొందరు. ఆ హీరోయిన్ ఎవరో కాదు యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఆది మూవీ హీరోయిన్. ఆది సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన సవసరం లేదు. ఇక వివి వినాయక్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది కీర్తీచావ్లా.
కీర్తి చావ్లా ఈ ముద్దుగుమ్మ తమిళం, తెలుగు, హిందీ, కన్నడ సినిమాల్లో నటించింది ఈ బ్యూటీ. తెలుగులో ఆమె నటించిన మొదటి సినిమా ఆదినే . తెలుగులో కేవలం ఏడు సినిమాల్లోనే నటించింది కీర్తి. వీటిలో కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా చేయగా మరికొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించింది.
ఇక ఇప్పుడు ఈ అమ్మడు ఎలా ఉందో తెలుసా.. కీర్తి చావ్లాకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 2016లో ఇలమై ఊంజల్ అనే తమిళ్ సినిమా తర్వాత కీర్తి చావ్లా మరో సినిమాలో నటించలేదు.