18 December 2024

అలాంటి సీన్లతో ఫేమస్.. ముంబైలో లగ్జరీ లైఫ్.. ఈ హీరోయిన్ ఎవరంటే..

Rajitha Chanti

Pic credit - Instagram

తెలుగు సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుని ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో సెటిల్ అయిపోయింది. అటు సినిమాలు, ఇటు వెబ్ సిరీస్‏లతో బిజీగా ఉంది.

రొమాంటిక్ సీన్లతో ఎక్కువగా పాపులర్ అయిన ఈ వయ్యారి.. ఇప్పుడు ముంబైలో లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. ఇటీవలే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.

ఆమె మరెవరో కాదు హీరోయిన్ రాధిక ఆప్టే. లెజెండ్, రక్త చరిత్ర, లయన్ వంటి చిత్రాలతో తెలుగు వారికి పరిచయమైంది. 14 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంది

సీక్రెడ్ గేమ్స్ లో అంజలి మాధుర్ గా డిజిటల్ అడియన్స్ ను కట్టిపడేసింది. మోనికా ఓ మై డార్లింగ్ తన గ్లామర్ తో కనువిందు చేసింది ఈ తెలుగు హీరోయిన్. 

కేవలం గ్లామర్ రోల్స్ కాకుండా కంటెంట్, పాత్ర ప్రాధాన్యతను బట్టి విభిన్నమైన సినిమాలను ఎంచుకుంది. తన అందం, టాలెంట్‏తో గుర్తింపు తెచ్చుకుంది. 

ప్రస్తుతం ముంబైలో ఖరీదైన బంగ్లా, లగ్జరీ కార్లతో జీవిస్తుందని రిపోర్ట్స్ పేర్కొన్నాయి. ఆమెకు ముంబైలోనే కాకుండా లండన్ లోనూ సొంతంగా ఇళ్లు ఉన్నాయట.

రాధిక ఆప్టే నికర విలువ దాదాపు రూ.66 కోట్లు. అలాగే ఒక్క సినిమాకు దాదాపు రూ.4 కోట్లు తీసుకుంటుందట. సినిమాలు, బ్రాండ్స్ ద్వారా సంపాదిస్తుంది.

రాధిక వద్ద లగ్జరీ కార్లు ఉన్నాయి. వోక్స్‌వ్యాగన్ టిగువాన్ (రూ.35-40 లక్షలు), ఆడి A4 (రూ.55 లక్షలు), బీఎమ్‌డబ్ల్యూ X2 (రూ.45 లక్షలు) ఉన్నాయి.