సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బ్లాక్ బస్టర్ సినిమాల్లో బిజినెస్ మెన్ సినిమా ఒకటి. డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మహేష్ బాబు ఫ్యాన్స్‌ను ఉర్రుతలూగించింది. ఈ సినిమాలో డైలాగ్స్ ప్రేక్షకులు ఇప్పటికి కూడా వాడుతున్నారు. 2012న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. మహేష్ బాబు, పూరిజగన్నాథ్ కాంబినేషన్స్ లో వచ్చిన రెండో సినిమా ఇది. అంతకు ముందు వచ్చిన పోకిరి సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇక బిజినెస్ మెన్ సినిమాలో మహేష్ బాబు మాఫియా డాన్‌గా నటించాడు. సూర్య భాయ్ పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించారు సూపర్ స్టార్. ఇక ఈ సినిమాలో మహేష్ కు జోడీగా కాజల్ అగర్వాల్ నటించింది.
ఇక ఈ సినిమా రీ రిలీజ్ కోసం మహేష్ ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే మహేష్ బాబు సినిమాలు రీ రిలీజ్ లోనూ అదరగొడుతున్నాయి. ఇటీవలే రిలీజ్ అయిన మురారి సినిమా రికార్డ్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.. ఇక ఇప్పుడు బిజినెస్ మెన్ రీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఇదిలా ఉంటే బిజినెస్ మెన్ సినిమాలో కాజల్ అగర్వాల్ ఫ్రెండ్ పాత్రలో నటించిన అమ్మడు గుర్తుందా.? క్యూట్ క్యూట్ మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఆమె.
ఆమె పేరు అయేషా శివ. ఈ ముద్దుగుమ్మ బిజినెస్ మెన్ సినిమా తర్వాత మరో సినిమాలో కనిపించలేదు. చేసింది తక్కువ సినిమాలే అయినా స్టార్‌గేట్: అట్లానిస్, కాప్రికా వంటి టీవీ సిరీస్‌లలో నటించి మెప్పించింది. నటిగానే కాదు నిర్మాతగానూ మారింది. సోషల్ మీడియా ఇన్ప్లుయెన్సర్‌గా రాణిస్తుంది ఈ అమ్మడు. పెళ్లి తర్వాత ఈ చిన్నది నటనకు దూరం అయ్యింది. పెళ్లి తర్వాత నటనకు పూర్తిగా దూరం అయ్యింది.. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంది. ఈ చిన్నది. ప్రస్తుతం ఈ అమ్మడు గర్భంతో ఉంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.