Prema Katha: ఓరి దేవుడా..!! ఆర్జీవీ ప్రేమ కథ సినిమా హీరోయిన్ ఏంటి ఇలా మారిపోయింది..!

|

Apr 19, 2023 | 8:58 AM

సుమంత్ హీరోగా నటించిన ఈ సినిమా మంచి హిట్ గా నిలిచింది . ఈ సినిమాతోనే సుమంత్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు. 1999 లో వచ్చిన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన అమ్మడు గుర్తుందా..?

Prema Katha: ఓరి దేవుడా..!! ఆర్జీవీ ప్రేమ కథ సినిమా హీరోయిన్ ఏంటి ఇలా మారిపోయింది..!
Prema Katha
Follow us on

ఇప్పుడంటే ఆర్జీవీ కాంట్రవర్సీ సినిమాలు చేస్తున్నారు కానీ ఒకప్పుడు ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించారు ఈ సంచలన దర్శకుడు. టాలీవుడ్ లో చెప్పుకోదగ్గ సినిమాల్లో ఆర్జీవీ సినిమాలు కూడా ఉండేవి. అందుకు పర్ఫెక్ట్ ఉదాహరణ శివ. ఒకప్పుడు ఈ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. యాక్షన్ సినిమాలే కాదు అందమైన ప్రేమ కథ చిత్రాలు కూడా తెరకెక్కించి శబాష్ అనిపించిన్నారు వర్మ. అలా ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమా ప్రేమ కథ . సుమంత్ హీరోగా నటించిన ఈ సినిమా మంచి హిట్ గా నిలిచింది . ఈ సినిమాతోనే సుమంత్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు. 1999 లో వచ్చిన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన అమ్మడు గుర్తుందా..? ఆమె పేరు అంతరా మలి.

అంతరా మలి బాలీవుడ్ హీరోయిన్. ఆమె నటించిన ఒకే ఒక్క తెలుగు సినిమా ఇది. ప్రేమకథ సినిమాలో ఈ ఈ చిన్నది తన అందంతో కట్టిపడేసింది. ధూండతే రెహ్ జావోగే అనే హిందీ సినిమాతో హీరోయిన్ గా మారారు అంతరా మలి. ఆ తర్వాత ప్రేమ కథ సినిమా చేశారు. ఈ మూవీ తర్వాత వరుసగా బాలీవుడ్ లో సినిమాలు చేశారు.

ఆమె చివరిగా ఎండ్ వన్స్ ఎగైన్ అనే హిందీ సినిమాలో నటించారు. ఇక ఈ భామ ఇప్పుడు ఎలా ఉందా అని కొందరు నెటిజన్లు గూగుల్ ను గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇప్పుడు ఆమె గూతుపట్టరాలేంతగా మారిపోయారు. చూస్తే మీరే షాక్ అవుతారు. ఈ అమ్మడు లేటెస్ట్ ఫొటోస్ పై మీరూ ఓ లుక్కేయండి.