ఇదేందయ్యా ఇది.. తమ్ముడు సినిమా హీరోయిన్ షాకింగ్ లుక్.. ఇలా మారిపోయిందేంటి..!!

అప్పటి యువతే కాదు ఇప్పటి యువతను కూడా తమ్ముడు సినిమా అలరిస్తుంది. తమ్ముడు సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడీగా నటించిన హీరోయిన్ గుర్తుందా..? ఆ అమ్మడి పేరు ప్రతీ జింగానియా. ఈ అమ్మడు ముందుగా "యే హై ప్రేమ్" అనే మ్యూజిక్ ఆల్బంలో అబ్బాస్‌తో కలిసి నటించింది.  తమ్ముడు సినిమాలో తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది.

ఇదేందయ్యా ఇది.. తమ్ముడు సినిమా హీరోయిన్ షాకింగ్ లుక్.. ఇలా మారిపోయిందేంటి..!!
Thammudu

Updated on: Jan 16, 2024 | 7:01 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సూపర్ హిట్ సినిమాల్లో తమ్ముడు సినిమా ఒకటి. అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో  సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా ఇప్పటికి టీవీలో వచ్చినా ఆయన ఫ్యాన్స్ కదలకుండా చూస్తుంటారు.తమ్ముడు సినిమా 1999లో రిలీజ్ అయ్యింది. అప్పటి యువతే కాదు ఇప్పటి యువతను కూడా తమ్ముడు సినిమా అలరిస్తుంది. తమ్ముడు సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడీగా నటించిన హీరోయిన్ గుర్తుందా..? ఆ అమ్మడి పేరు ప్రతీ జింగానియా. ఈ అమ్మడు ముందుగా “యే హై ప్రేమ్” అనే మ్యూజిక్ ఆల్బంలో అబ్బాస్‌తో కలిసి నటించింది.  తమ్ముడు సినిమాలో తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది.

తమ్ముడు సినిమాలో జానకి పాత్రలో అద్భుతంగా నటించింది. అందమైన రూపంతో అమాయకపు చూపులతో ఆకట్టుకుంది. ప్రీతీ. మలయాళ సినిమా “మళవిల్లు”తో సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. “మొహబ్బతే” సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఆమె తరువాత హిందీ సినిమా “ఆవారా పాగల్ దీవానా” అనే కామెడీ సినిమాలో నటించింది. ఆ తర్వాత ఇంకా కన్నడ, పంజాబీ, ఉర్దూ, బెంగాలీ, రాజస్థానీ సినిమాలలో నటించింది.

ప్రీతీ సహీ దంధే గలత్ బందే అనే హిందీ సినిమాను స్వంతంగా నిర్మించి బాలీవుడ్ మహిళా నిర్మాతల లిస్ట్ లో చేరింది. ఈమె 2013 తర్వాత వివాహం, సంతానం కారణంగా కొంతకాలం సినిమాలకు దూరంగా ఉంది. 2011లో జయ్‌వీర్, 2016లో దేవ్ అనే ఇద్దరు మగ పిల్లలకు జన్మనిచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంది.

ప్రతీ జింగానియా ఇన్ స్టాగ్రామ్

ప్రతీ జింగానియా ఇన్ స్టాగ్రామ్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.