గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలు మార్చి 27 సాయంత్రం గ్రాండ్గా జరిగిన సంగతి తెలిసిందే. ఈ సెలబ్రెషన్స్లో టాలీవుడ్ సినీ తారలు సందడి చేశారు. హైదరాబాద్ లోని మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో దర్శకధీరుడు రాజమౌళి, మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి, యంగ్ హీరో అడివి శేష్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్, అక్కినేని నాగార్జున ఫ్యామిలీ.. కాజల్ దంపతులు.. బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. అయితే ఎవరీ పుట్టిన రోజు వేడుకలకు వెళ్లినా.. వారికి ఓ బహుమతి ఇవ్వడం జక్కన్నకు అలవాటు. ఇక ఎప్పటికీలాగే హీరో చెర్రీకి కూడా జక్కన్న ఓ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు.
ఇందుకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. దీంతో చెర్రీకి జక్కన్న ఇచ్చిన గిఫ్ట్ ఏంటా ? అని సెర్చ్ చేస్తున్నారు నెటిజన్స్. చెర్రీకి రాజమౌళి రోజ్ వుడ్ తో చేసిన ఓ యూనిక్ హ్యాండ్ మెడ్ లారీతోపాటు..రోజ్ వుడ్ తో చేసిన ఓ ప్రతిమను బహుమతిగా అందించారు. మెగా ఫ్యామిలీతో రాజమౌళి కుటుంబానికి మంచి అనుబంధం ఉంది. మగధీర సినిమాతో ఇరు కుటుంబాల మధ్య స్నేహం ఏర్పడింది. ఇక ఆర్ఆర్ఆఱ్ సినిమాతో ఆ బంధం మరింత బలపడింది. ఈ వేడుకలలోనే జక్కన్న అండ్ కీరవాణీలను సత్కరించారు మెగాస్టార్.
ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ అనే సినిమా చేస్తున్నారు. భారీ బడ్జె్ట్ తో నిర్మిస్తోన్న ఈ చిత్రంలో కియారా అద్వానీ, అంజలి కథానాయికలుగా నటిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ ఆడియన్స్ ముందుకు రానుంది.
That’s one grand party! #Rajamouli with his family was seen entering Ram Charan’s birthday celebrations in Hyderabad#upasana #upasanakonidela #ramcharan #ramcharanbirthday #hbdramcharan #upasanakamineni #nagarjuna #Telugu #Tollywood #ssrajamouli #saidharamtej #ranadaggubati pic.twitter.com/vWXBUNjkBc
— BTown Ki Billi South Cinema (@bkbsouthcinema) March 28, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.