మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన బస్ స్టాప్ సినిమా యూత్ ను బాగా ఆకట్టుకుంది. ప్రిన్స్ హీరోగా నటించిన ఈ సినిమాలో తెలుగమ్మాయి శ్రీ దివ్య హీరోయిన్ గా నటించింది. అందం, అభినయంతో అందరి దృష్టిని ఆకర్షించింది. సినిమా కూడా హిట్ కావడంతో శ్రీ దివ్యకు అవకాశాలు బాగా వచ్చాయి. అలాగే రవి బాబు దర్శకత్వంలో ఆమె నటించిన మనసారా సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. అంతకు ముందు హనుమాన్ జంక్షన్, యువరాజు, వీడే తదితర సినిమాల్లో ఛైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది శ్రీ దివ్య. ఆ తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మల్లెలతీరంలో సిరిమల్లెపువ్వు, కేరింత, తదితర సినిమాల్లో మెరిసిన ఈ ముద్దుగుమ్మకు తెలుగులో కంటే తమిళంలోనే ఈ ముద్దుగుమ్మ ఎక్కువగా సినిమాలు చేసింది. కార్తీతో కాష్మోరా, విశాల్ తో రాయుడు , శివకార్తికేయన్ తో రెమో తదితర స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇటీవల రిలీజైన సూపర్ హిట్ సినిమా సత్యం సుందరం లోనూ ఒక కీలక పాత్రలో మెరిసింది.
ఇక ఇదిలా ఉంటే శ్రీ దివ్య వాళ్ల అక్క కూడా టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్ అని చాలా మందికి తెలియదు. ఆమె పేరు శ్రీ రమ్య. 2008లో వచ్చిన 1940లో ఒక గ్రామం అనే సినిమాలో కథానాయికగా నటించింది శ్రీ రమ్యనే. ఈ సినిమాకు ఏకంగా నంది అవార్డు సైతం రావడం విశేషం. బాలాదిత్య హీరోగా నటించిన ఈ సినిమాలో సుశీల అనే అమాయక అమ్మాయి పాత్రలో అద్భుతంగా నటించింది శ్రీ రమ్య. ఆ తర్వాత శ్రీకాంత్‌తో విరోధి, అలియాస్ జానకి వంటి సినిమాలు చేసింది. అయితే అవి పెద్దగా ఆడలేదు. దీంతో ఈ బ్యూటీకి పెద్దగా అవకాశాలు రాలేదు. 2013లో తమిళంలో యమున అనే సినిమాలో చివరిసారిగా శ్రీ రమ్య కనిపించింది.
.మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.