Srikanth: శ్రీకాంత్ సోదరుడు కూడా హీరో అని మీకు తెల్సా..?

సీనియర్ హీరో శ్రీకాంత్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎప్పుడూ ఖాళీగా ఉండకుండా ఏదో ఒక ప్రాజెక్ట్ తో బిజీగా ఉంటారు శ్రీకాంత్. ‘అఖండ’ తో పవర్ ఫుల్ విలన్ గా మారిన శ్రీకాంత్.. సోదరుడు కూడా కథనాయకుడిగా ఓ సినిమా చేశాడు. ఆ విశేషాలు మీ కోసం....

Srikanth: శ్రీకాంత్ సోదరుడు కూడా హీరో అని మీకు తెల్సా..?
Chiranjeevi, Srikanth

Updated on: Mar 25, 2024 | 7:06 PM

హీరో శ్రీకాంత్ అంటే వివాద రహితుడు అని ఇండస్ట్రీలో గుర్తింపు ఉంది. అంతేకాదు చిరంజీవిని చూసి ఇన్‌స్పైర్ అయి ఇండస్ట్రీకి వచ్చి పెద్ద హీరో అయ్యాడు. తొలుత విలన్ వేషాలు వేసిన శ్రీకాంత్ ఆ తర్వాత హీరో అయ్యారు. కథానాయకుడిగా ఆయన కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బాస్టర్స్ ఉన్నాయి. హీరోగా కెరీర్ అంత బాగోలేకపోవడంతో.. ప్రజంట్ విలన్, క్యారక్టర్ రోల్స్ చేస్తున్నారు. ఇక శ్రీకాంత్ పర్సనల్ విషయానికి వస్తే.. అప్పటి హీరోయిన్ ఊహను లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఈ కపుల్‌కు ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి(రోషన్, రోహన్, మేధా) సంతానం. శ్రీకాంత్ పెద్ద కొడుకు రోషన్ ప్రజంట్ హీరోగా సినిమాలు చేస్తూ నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

అయితే శ్రీకాంత్ తమ్ముడు అనిల్ కూడా అప్పట్లో హీరోగా ఎలివేట్ అయ్యే ప్రయత్నం చేశాడు. అతను ‘ప్రేమించేది ఎందుకమ్మ’ అనే సినిమాలో నటించాడు. ఆ సినిమా అంతగా ప్రభావం చూపకపోవడంతో.. అనిల్‌తో సినిమాలు తీసేందుకు మేకర్స్ జంకారు. అలా అతను ఇండస్ట్రీలో సెటిల్ అవ్వలేకపోయాడు. అయితే చాలాకాలం తర్వాత ప్రొడ్యూసర్‌గా మారి శ్రీకాంత్‌తో విరోధి సినిమాను నిర్మించాడు. ఆ సినిమా కూడా పెద్దగా ఆడలేదు. దీంతో ఇండస్ట్రీకి దూరంగా జరిగాడు అనిల్. కాగా శ్రీకాంత్, అనిల్‌ల సోదరి కుమార్తెనే హీరో గోపిచంద్ పెళ్లాడాడు. గోపించంద్ భార్య పేరు.. రేష్మ. అందుకే గోపి దంపతులు.. శ్రీకాంత్ ఇంట్లో అన్ని కార్యక్రమాల్లో కనిపిస్తూ ఉంటారు.

Srikanth – Anil

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.