కమెడియన్ సునీల్ ను హీరోగా పెట్టి రాజమౌళి తెరకెక్కించిన సినిమా మర్యాద రామన్న. సలోని కథానాయికగా నటించింది. అలాగే నాగి నీడు, సుప్రీత్, ప్రభాకర్, బ్రహ్మాజీ, సుబ్బరాయ శర్మ, రావు రమేష్, ఛత్రపతి శేఖర్, కాంచి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. కీరవాణి స్వరాలు సమకూర్చారు. 2013 జులైలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. స్టార్ క్యాస్టింగ్ లేనప్పటికీ ఒక కమర్షియల్ సినిమాకు కావాల్సిన అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి. తండ్రికి ఉన్న గొడవల కారణంగా సునీల్ హీరో ఉరికి దూరంగా బతుకుతుండడం, తనకు ఊర్లో ఆస్తులున్నాయని తెలిసి తిరిగి తన ఊరికి వెళ్లడం, మధ్యలో ట్రైన్ లో హీరోయిన్ సలోని పరిచయం కావడం, చివరకు శత్రువల ఇంట్లోనే ఆశ్రయం తీసుకోవడం.. ఇలా ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది మర్యాద రామన్న సినిమా. ఇంట్లో నెత్తురు కనిపించకూడదని, ఇల్లు దాటితనే హీరోను చంపేయాలనుకనే విలన్ కట్టుబాట్లు సినిమాను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లాయి. ఇక ఈ సినిమాలో ట్రైన్ సీన్స్ బాగా పేలాయి. అందులో ‘ఏం రావట్లేదా’ అంటూ ట్రేడ్ మార్క్ డైలాగ్ తో ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించారు నటుడు కాంచి. అన్నట్లు ఆయన మరెవరో కాదు రాజమౌళి కజిన్. గతంలో అమృతం సీరియల్ తో తెలుగు బుల్లితెర ఆడియెన్స్ కు బాగా చేరువైపోయారీ ట్యాలెంటెడ్ రైటర్ కమ్ యాక్టర్. ఇక మర్యాద రామన్న సినిమాతో సినీ ఆడియెన్స్ ను కూడా అలరించాడు.
అన్నట్లు కాంచి నటుడే కాదు మంచి రచయిత కూడా. రాజమౌళి తెరకెక్కించిన మర్యాద రామన్న, ఈగ, మగధీర సినిమాలకు రైటర్ గా పనిచేశారు. అలాగే శ్రీ కృష్ణ 2026, ఏమో గుర్రం ఎగరావచ్చు తదితర సినిమాలకు డైలాగ్ రైటర్ గా, స్క్రీన్ ప్లే రైటర్ గా వ్యవహరించారు. మర్యాద రామన్న తర్వాత నితిన్ హీరోగా రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కిన సై సినిమాలో కూడా జెనీలియా ఫాదర్‌గా నటించాడీ సీనియర్ యాక్టర్.
అన్నట్లు కాంచికి కీరవాణి కూడా అన్న వరుస అవుతారు. అంతేకాదు కీరవాణి కొడుకు మత్తు వదలరా ఫేమ్ 2 హీరో శ్రీ సింహా కోడూరి కూడా… కాంచితో చాలా ప్రేమగా ఉంటాడట.అలాగే సింగర్ కాల భైరవ, రాజమౌళి దర్శకుడు ఎస్. ఎస్. కార్తికేయలను కూడా కన్న కొడుకుల్లా చూసుకుంటాడట. శ్రీ సింహా లేటెస్ట్ గా నటించిన మత్తు వదలరా 2 చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలసిందే.
Happened to visit Vapi
MERIL
what an industrious state #Gujarat 😊 pic.twitter.com/m6wbUonKQe— ss kanchi శివ శ్రీకాంచి (@kanchi5497) June 22, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. చేయండి.