Mirai Movie : మిరాయ్ సినిమాలో రాముడిగా నటించిన ఈ నటుడు ఎవరో తెలుసా.. ? బ్యాగ్రౌండ్ ఇదే..

ఎలాంటి హడావిడి లేకుండా థియేటర్లలోకి వచ్చిన మిరాయ్ సినిమాకు ఇప్పుడు అడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ వస్తుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తుంది. హానుమాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తేజ సజ్జా.. ఇప్పుడు మరోసారి భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా అత్యధిక కలెక్షన్లతో దూసుకుపోతుంది.

Mirai Movie : మిరాయ్ సినిమాలో రాముడిగా నటించిన ఈ నటుడు ఎవరో తెలుసా.. ? బ్యాగ్రౌండ్ ఇదే..
Mirai Movie

Updated on: Sep 14, 2025 | 7:53 PM

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా నటించిన లేటేస్ట్ మూవీ మిరాయ్. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమాకు దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. ఇందులో మంచు మనోజ్, శ్రియా, రితిక నాయక్ కీలకపాత్రలు పోషించారు. సూపర్ హీరో తరహా జానర్ లో మూవీ తెరకెక్కించినప్పటికీ క్లైమాక్స్ లో శ్రీరాముడిని రిఫరెన్స్ గా చూపించడం జనాలకు తెగ నచ్చేసింది. అయితే ఈ సినిమాలో రాముడి పాత్రలో ప్రభాస్ నటించాడని.. ఈ మూవీ విడుదలకు ముందు రమర్స్ వచ్చాయి. కానీ ఆ పాత్రను ఓ యువ నటుడు పోషించారు. దీంతో ఇప్పుడు అతడి గురించి తెలుసుకోవడానికి జనాలు ఆసక్తి చూపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి : Actors: ఇద్దరు అన్నదమ్ములు తెలుగులో క్రేజీ హీరోస్.. ఒకరు పాన్ ఇండియా.. మరొకరు టాలీవుడ్..

ఈ సినిమాలో చివర్లో వచ్చే శ్రీరాముడి పాత్ర కథను టర్న్ అయ్యేలా చేస్తుంది. రెండు నిమిషాలు ఉన్న ఆ పాత్రలో ముఖం కనిపించి కనిపించకుండా చూపించారు. దీంతో ఆ పాత్రను ఎవరు చేశారా అని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. ఆ పాత్రలో కనిపించిన నటుడి పేరు గౌరవ్ పోరా. ఉత్తరాఖండ్ లోని డహ్రాడూన్ కు చెందిన గౌరవ్ మాస్ కమ్యూనికేషన్స్ పూర్తి చేశాడు. ఆ తర్వాత నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టాడు. చదువు పూర్తి చేసిన అతడు ఢిల్లీ వచ్చేసి థియేటర్ గ్రూప్ లో చేరాడు. ఐదేళ్లపాటు హిందీలో పలు నాటకాలు వేశాడు.

ఇవి కూడా చదవండి : Cinema : ఇదెందయ్య ఇది.. ఓటీటీలో దూసుకుపోతుంది.. అయినా థియేటర్లలో కలెక్షన్స్ ఆగడం లేదు..

పలు షార్ట్ ఫిల్మ్స్, హిందీ సీరియల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న గౌరవ్.. కొన్ని కమర్షియల్ యాడ్స్ లోనూ నటించారు. ఇక ఇప్పుడు మిరాయ్ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు వచ్చింది. దీంతో గౌరవ్ కు ఇప్పుడు మరిన్ని అవకాశాలు రానున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి : Shivani Nagaram: లిటిల్ హార్ట్స్ సినిమాతో కుర్రాళ్ల హృదయాలు దొచుకున్న చిన్నది.. ఈ హీరోయిన్ గురించి తెలుసా.. ?

ఇవి కూడా చదవండి : Tollywood: అప్పుడు క్యాటరింగ్ బాయ్.. ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.90 కోట్లు.. క్రేజ్ చూస్తే..