
దక్షిణాది సినిమా ప్రపంచంలో బహుముఖ ప్రజ్ఞాశాలి నటుడు, కొరియోగ్రాఫర్, దర్శకుడు, నిర్మాత రాఘవ లారెన్స్. ప్రస్తుతం సినీరంగంలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. కొరియోగ్రాఫర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన లారెన్స్.. ఆ తర్వాత నటుడిగా పలు చిత్రాలలో చిన్న చిన్న పాత్రలు పోషించారు. అలాగే హీరోగానూ ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించారు. అటు దర్శకుడిగా, నిర్మాతగానూ సక్సెస్ అయ్యారు. అయితే ఓవైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే.. మరోవైపు కష్టాల్లో ఉన్న పేదవాళ్లకు తనవంతు సాయం అందిస్తున్నారు. అనాథలకు, వృద్ధులకు, పేదలకు ఆర్థిక సహాయం అందిస్తుంటారు. సినిమాల నుంచి తాను సంపాదించిన ఆస్తులను పేదలకు సహయం చేసేందుకు ఉపయోగిస్తున్నారు. ఇంతకీ లారెన్స్ ఆస్తులు ఎంత ఉంటాయో తెలుసా.. ?
ఇవి కూడా చదవండి : Actress: కేకపెట్టిందిరోయ్.. గ్లామర్ ఫోజులతో సెగలు పుట్టించిన సీరియల్ బ్యూటీ.. హీటెక్కిస్తోన్న వయ్యారి..
నివేదికల ప్రకారం లారెన్స్ ఆస్తులు రూ.100 కోట్లకు పైగా ఉన్నాయని సమాచారం. లారెన్స్ తన సినిమాల ద్వారా వచ్చిన ఆదాయంలో ఎక్కువ భాగాన్ని సామాజిక సేవ చేయడానికి ఖర్చు చేస్తారు. దివ్యాంగులకు నృత్యం నేర్పించడం, గుండె జబ్బు ఉన్న పిల్లలకు శస్త్రచికిత్స చేయించడం.. , పేద విద్యార్థులకు వారి విద్యకు సహాయం చేయడం వంటివి చేస్తుంటారు లారెన్స్. ఒక సాధారణ ట్రూప్ డ్యాన్సర్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించి.. ఇప్పుడు ఇండస్ట్రీలోనే టాప్ నటులలో ఒకరిగా పేరు సంపాదించుకున్నారు. రాఘవ లారెన్స్ నటుడిగానే కాకుండా విజయవంతమైన దర్శకుడు, నిర్మాతగానూ సక్సెస్ అయ్యారు. ముని, కాంచన వంటి హారర్ కామెడీ చిత్రాలను తక్కువ బడ్జెట్ తో నిర్మించి బాక్సాఫీస్ వద్ద వందల కోట్లు రాబట్టాడు.
ఇవి కూడా చదవండి : Cinema : 64 ఏళ్ల హీరో సరసన 27 ఏళ్ల హీరోయిన్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..
స్టార్ హీరోల సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా పనిచేయడం, రియల్ ఎస్టేట్ సహా ఇతర వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టడం వల్ల లారెన్స్ ఆదాయం పెరిగింది. ప్రస్తుతం లారెన్స్ ఆస్తులు రూ.100 కోట్లకు పైగానే ఉన్నాయని సమాచారం. ప్రస్తుతం కాంచన 4, బెంజ్ చిత్రాల్లో నటిస్తున్నారు. ఇందులో కాంచన 4 చిత్రానికి లారెన్స్ స్వయంగా దర్శకత్వం వహిస్తున్నారు.
ఇవి కూడా చదవండి : Jabardasth: నైట్ వాచ్మెన్ నుంచి సినిమాల్లో నటుడిగా.. ఈ జబర్దస్త్ కమెడియన్ జీవితంలో ఇన్ని కష్టాలా.. ?