Tollywood: తెలుగులో తోపు హీరోయిన్.. మాజీ సీఎం మేనల్లుడితో ప్రేమ, పెళ్లి.. 22 ఏళ్లకే..

14 ఏళ్ల వయసులోనే సినీరంగంలోకి అడుగుపెట్టిన అచ్చ తెలుగు అమ్మాయి. కేవలం 15 సంవత్సరాల వయసులోనే ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‏గా మారింది. అగ్ర హీరోలతో వరుస సినిమాలు చేస్తూ అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. శ్రీదేవి, రజినీకాంత్ వంటి స్టార్స్ సైతం ఆమెకు వీరాభిమానులు. కానీ 22 ఏళ్లకే తనువు చాలించింది. వెండితెరపై సందడి చేసిన ఆ హీరోయిన్.. ప్రేమ, పెళ్లితో మోసపోయిందని అంటారు.

Tollywood: తెలుగులో తోపు హీరోయిన్.. మాజీ సీఎం మేనల్లుడితో ప్రేమ, పెళ్లి.. 22 ఏళ్లకే..
Fatafat Jayalakshmi

Updated on: May 30, 2025 | 7:41 AM

సినీరంగంలో చాలా మంది నటీమణులు ఉన్నారు. చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టి.. తొలి చిత్రంతోనే తమదైన ముద్ర వేసిన తారల గురించి చెప్పక్కర్లేదు. ఇండస్ట్రీలో చాలా చిన్న వయసులోనే తన కెరీర్ స్టార్ట్ చేసి 16 ఏళ్లకే స్టార్ డమ్ సంపాదించుకున్న ఒక హీరోయిన్ గురించి మాట్లాడుకుందాం. వెండితెరపై అందం, అభినయంతో సందడి చేసిన ఆమె.. ఆ తర్వాత 22 ఏళ్లకే తనువు చాలించింది. ప్రేమ, పెళ్లి ఆమె జీవితాన్ని నాశనం చేసిందని అంటారు. ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీని ఏలేసిన ఈ అచ్చ తెలుగు హీరోయిన్ గురించి మీకు తెలుసా.. ? 16 ఏళ్లకే స్టా్ర్ డమ్ సంపాదించుకున్న ఆమె.. మెగాస్టార్ చిరంజీవితో పలు చిత్రాల్లో నటించింది. తక్కువ సమయంలోనే శ్రీదేవి, రజినీకాంత్ వంటి అగ్ర తారలకు ఇష్టమైన నటిగా మారింది. ఆమెనే ఫటాఫట్ జయలక్ష్మి. ఆమె అసలు పేరు జయలక్ష్మి రెడ్డి.

1958లో ఆంధ్రప్రదేశ్‌లో జన్మించిన జయలక్ష్మి 1972లో ఎ నుండి బి.ఎ. పట్టా పొందారు. 14 ఏళ్ల వయసులోనే సినీరంగంలోకి అడుగుపెట్టింది. 1972లో ఇద్దరు అమ్మాయిలు సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయం అయ్యింది. ఇందులో అక్కినేని నాగేశ్వర రావుతో కలిసి కనిపించింది. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న ఆమె ఆ తర్వాత తెలుగుతోపాటు తమిళం, మలయాళం భాషలలో వరుస అవకాశాలు అందుకుంటూ ఆనతి కాలంలోనే సూపర్ స్టార్ అయ్యింది. రజినీకాంత్, కమల్ హాసన్, కృష్ణ, ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవి వంటి అగ్ర హీరోలతో కలిసి నటించింది. తెలుగులో అప్పట్లో ఆమెకు విపరీతమైన క్రేజ్ ఉండేది. జయలక్ష్మి సినిమా కోసం అడియన్స్ ఎదురుచూసేవారు. 2018లో రజినీకాంత్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు ఇష్టమైన ఫటాఫట్ జయలక్ష్మి అని చెప్పారు. కేవలం ఆయనకే కాదు.. ఆమెతో నటించిన అందరూ స్టార్స్ ఆమె తమ ఫెవరేట్ అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి.

కెరీర్ మంచి ఫాంలో ఉండగానే ఆమె అధిక మోతాదులో నిద్రమాత్రలు తీసుకుని ప్రాణాలు కోల్పోయిందని అంటారు. వరుస సినిమాలతో కెరీర్ పీక్స్ లో ఉండగానే జయలక్ష్మి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఏంజీఆర్ మేనల్లుడు సుకుమార్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే కొన్ని రోజులకే వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని.. దీంతో అతడితో విడిపోయిన తర్వాత తీవ్ర మానసిక సంఘర్షణకు గురైన జయలక్ష్మి 22 ఏళ్ల వయసులోనే ఆత్మహత్య చేసుకుందట. అప్పట్లో ఆమె సూసైడ్ ఘటన ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేపింది.

Fatafat Jayalakshmi Life

ఇవి కూడా చదవండి :  

Damarukam Movie: ఢమరుకం మూవీ విలన్ భార్య తెలుగులో తోపు హీరోయిన్.. ఇంతకీ ఆమె ఎవరంటే..

Megastar Chiranjeevi: అమ్మ బాబోయ్.. చిరంజీవి ఆపద్బాంధవుడు హీరోయిన్‏ గుర్తుందా..? ఇప్పుడు చూస్తే స్టన్ అవ్వాల్సిందే..

OTT Movie: బాక్సాఫీస్ షేక్ చేసిన హారర్ మూవీ.. 3 కోట్లతో తీస్తే రూ.70 కోట్ల కలెక్షన్స్.. 2 గంటలు నాన్‏స్టాప్ సస్పెన్స్..

Actress: ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన హీరోయిన్.. స్టార్ హీరోలతో సినిమాలు.. ఇప్పుడు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్..

 

  • Beta

Beta feature