Amaran: అమరన్ సినిమాలో శివకార్తికేయన్ చెల్లిగా నటించిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా..

| Edited By: Basha Shek

Nov 07, 2024 | 7:57 AM

అమరన్ సినిమా.. లవ్, యాక్షన్, ఎమోషనల్ థ్రిల్లర్ డ్రామా. ఇందులో కోలీవుడ్ హీరో శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించగా.. డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు. మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం దీపావళి సందర్భంగా ఆక్టోబర్ 31న విడుదలైంది.

Amaran: అమరన్ సినిమాలో శివకార్తికేయన్ చెల్లిగా నటించిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా..
Sugamya Shankar
Follow us on

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న సినిమా అమరన్. డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కిన లవ్, యాక్షన్, ఎమోషనల్ థ్రిల్లర్ డ్రామాలో కోలీవుడ్ హీరో శివకార్తికేయన్ హీరోగా నటించారు. అలాగే ఇందులో న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి కథానాయికగా నటించింది. మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో ముకుంద్ పాత్రలో శివ కార్తికేయన్.. అతడి భార్య ఇందు రెబికా వర్గీస్ పాత్రలో సాయి పల్లవి నటించింది. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా 34 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాలో శివకార్తికేయన్, సాయి పల్లవి నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ మూవీలో హీరో శివకార్తికేయన్‌కు చెల్లెలుగా నటించింది సుగమ్య శంకర్.

సుగమ్య శంకర్ ఇప్పుడు అమరన్ సినిమాతో వార్తల్లో నిలిచారు. ఈ చిత్రంలో మేజర్ ముకుంద వరదరాజన్‌గా నటించిన శివకార్తికేయన్ సోదరి నిత్యా వరదరాజన్ పాత్రను పెనుకొండ సుగమ్య శంకర్ పోషించారు. ఈ సినిమా విజయంతో నటి సుగమ్యకు కుటుంబ సభ్యులు మిఠాయిలు పంచి ఆనందాన్ని వ్యక్తం చేశారు. సుగమ్య శంకర్ భరత నాట్యం కూచిపూడి కళాకారిణి. ఆమె థియేటర్ ఆర్టిస్ట్ కూడా. సుగమ్య శంకర్ వెబ్ సిరీస్ పాలే చోప్లుతో పాటు పలు షార్ట్ ఫిల్మ్‌లలో నటించింది.

ఇదిలా ఉంటే.. తాజాగా సుగమ్య శంకర్ మాట్లాడుతూ.. వీరమరణం పొందిన మేజర్‌కు సోదరిగా నటించడం గర్వంగా ఫీలవుతున్నానని తెలిపింది. దేశానికి సంబంధించిన సినిమాలో అవకాశం రావడం ఆనందంగా ఉందన్నారు. ప్రస్తుతం తాను మూడు సినిమాల్లో నటిస్తున్నాని తెలిపింది. ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా.. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా బ్యానర్‌పై నిర్మించారు. అమరన్ ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ అనే రెండు ప్లాట్‌ఫారమ్‌లు కొనుగోలు చేసినట్లు సమాచారం.

ఇది చదవండి : Arundhati movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు.. అరుంధతి డ్యాన్స్ టీచర్‏ను చూశారా..?

Anshu Ambani: మతిపోగొట్టేస్తోన్న మన్మథుడు హీరోయిన్.. కొత్త ఫోటోలతో మెంటలెక్కిస్తోన్న అన్షు..

Tollywood: నడుమందాలతో తికమక పెట్టేస్తోన్న వయ్యారి.. హిట్టు కొట్టిన క్రేజీ హీరోయిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.