చిన్న సినిమాగా వచ్చి మంచి విజయాన్ని అందుకుంది బలగం సినిమా. నటుడు వేణు టిల్లు దర్శకుడిగా మారి తెరకెక్కించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడమే కాదు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాలో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో నటించారు. ఇక ఈ సినిమా ప్రతి క్యారెక్టర్ అద్భుతంగా నటించారు. చాలా వరకు కొత్త వాళ్ళతోనే ఈ సినిమాను తెరకెక్కించాడు వేణు. ఇక ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది.
ఇక ఈ సినిమాలో లచ్చవ్వ పాత్రలో నటించింది ఎవరో తెలుసా.. ఆమె పేరు రూపలక్ష్మి. ఆమె సీరియల్ నటి అలాగే పలు సినిమాల్లోనూ నటించింది. బలగం సినిమాలో రూపలక్ష్మి పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేసింది. ఆమె చాలా సహజసిద్ధమైన యాక్టింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ ఆమెకు ఈ సినిమాకు వచ్చినంత గుర్తింపు ఆమెకు మరో సినిమాలో రాలేదు. లచ్చవ్వ క్యారెక్టర్ ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంది. తాజాగా రూపలక్ష్మి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోల పై మీరు ఓ లుక్కేయండి.