కల్కి సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి సినిమాతో మరోసారి వెయ్యికోట్ల క్లబ్ లోకి చేరిపోయారు. బాహుబలి సినిమా తర్వాత కల్కి ఆ రికార్డ్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. మహాభారత నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో చాలా మంది నటీనటులు ఉన్నారు. టాలీవుడ్ హీరోలు, హీరోయిన్స్ తో పాటు పలువురు దర్శకులు కూడా ఈ సినిమాలో నటించారు. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, ఆర్జీవీ, రాజమౌళి, అవసరాల శ్రీనివాస్ ఇలా చాలా మంది ఈ సినిమాలో కనిపించారు. అలాగే శోభన, రాజేంద్ర ప్రసాద్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో కీలకపాత్రల్లో కనిపించారు. ఈ సినిమాను పలు పార్ట్స్‌గా తెరకెక్కించనున్నారు దర్శకుడు నాగ్ అశ్విన్.
కల్కి సినిమా థియేటర్స్ లో దుమ్మురేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో ఆకట్టుకుంటుంది. కల్కి 2898ఏడీ సినిమా రెండు ఓటీటీల్లో అందుబాటులో ఉంది. నెట్ ఫ్లిక్స్ లో కల్కి హిందీ వర్షన్, అలాగే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇతర భాషల్లో కల్కి సినిమా అందుబాటులో ఉంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో చాలా మంది కొత్త నటీనటులు కనిపించారు. కాగా కల్కి సినిమాలో కాంప్లేక్స్ లో దీపికా పడుకునేకు సాయం చేసిన నటి గుర్తుందా.?
ఆమె ఎవరో తెలుసా.? కల్కి సినిమా చూసిన చాలా మంది ఈ అమ్మడు ఎవరు అంటూ గూగుల్ ను గాలిస్తున్నారు. చిన్న పాత్రే అయినా బాగా ఆకట్టుకుంది ఈ యాక్టర్. ఆమె పేరు కావ్య రామచంద్రన్. కేరళలో పుట్టిన ఈ చిన్నది.. ఆ తర్వాత ఫ్యామిలీతో చెన్నై కు షిఫ్ట్ అయ్యింది. ఇక ఈ అమ్మడు నటి మాత్రమే కాదు ప్రొఫిషనల్ స్విమ్మర్ కూడా.. అలాగే విద్యావేత్త, థియేటర్ ఆర్టిస్ట్ ఈ అమ్మడు. అలాగే చాలా యాడ్స్ లో నటించింది. క్యాడ్బరీ డైరీ మిల్క్ చాక్లెట్, తనిష్క్, క్యారెట్ లేన్, మింత్ర, కర్లాన్, మిల్కీ బికిస్ యాడ్స్ లో మెరిసింది. అలాగే బ్రూ యాడ్‌లోనూ కనిపించింది. వీటితో పాటు బెంగళూరులోని ఒక ఎన్జీవోలో ఏడాదిపాటు పనిచేసింది. అలాగే సుఖా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ అనే ఎన్జీవోకి సహ వ్యవస్థాపకురాలు కూడా కావ్య రామచంద్రన్. ఇక కల్కి సినిమాలో అవకాశం అందుకున్న ఈ అమ్మడు తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.