Mahesh Babu: ‘మురారి’ సినిమాలోని శాపం వెనుక స్టోరీ తెలుసా ?.. ఆ సాంగ్ వద్దని చెప్పినా వినని డైరెక్టర్..

2001 ఫిబ్రవరి 17న రిలీజ్ అయిన ఈ మూవీ అప్పట్లో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అప్పటికే రెండు డిజాస్టర్స్ అందుకున్న మహేష్‏కు ఈ సినిమా టర్నింగ్ పాయింట్ అయ్యింది. ఈఏడాది ఫిబ్రవరి 17కు ఈసినిమాకు 23 ఏళ్లు పూర్తయ్యాయి. అయితే ఈ క్రమంలోనే మురారి సినిమా గురించి ఆసక్తికర విషయాలు ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మురారి సినిమాలో హీరోను వెంటాడే శాపం వెనుక ఓ స్టోరీ ఉంది. మరీ అదెంటో తెలుసుకుందామా.  సాధారణంగా ప్రతి సినిమాలో హీరోను విలన్ చంపడానికి ప్రయత్నిస్తాడు..

Mahesh Babu: మురారి సినిమాలోని శాపం వెనుక స్టోరీ తెలుసా ?.. ఆ సాంగ్ వద్దని చెప్పినా వినని డైరెక్టర్..
Murari Movie

Updated on: Feb 20, 2024 | 11:22 AM

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‏లోనే ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ‘మురారి’. డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సోనాలి బింద్రే కథానాయికగా నటించింది. 2001 ఫిబ్రవరి 17న రిలీజ్ అయిన ఈ మూవీ అప్పట్లో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అప్పటికే రెండు డిజాస్టర్స్ అందుకున్న మహేష్‏కు ఈ సినిమా టర్నింగ్ పాయింట్ అయ్యింది. ఈఏడాది ఫిబ్రవరి 17కు ఈసినిమాకు 23 ఏళ్లు పూర్తయ్యాయి. అయితే ఈ క్రమంలోనే మురారి సినిమా గురించి ఆసక్తికర విషయాలు ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మురారి సినిమాలో హీరోను వెంటాడే శాపం వెనుక ఓ స్టోరీ ఉంది. మరీ అదెంటో తెలుసుకుందామా. సాధారణంగా ప్రతి సినిమాలో హీరోను విలన్ చంపడానికి ప్రయత్నిస్తాడు.. కానీ ఈసారి అతడు మనిషి కాకుండా ఒక శక్తి కావాలని అనుకున్నారట. దానిని ఎలా జయించాలి అనే విషయం ఎవరికీ తెలియదని.. చివరి నిమిషం వరకు దానిపై సస్పెన్స్ ఉండాలని అనుకున్నట్లు గతంలో డైరెక్టర్ కృష్ణవంశీ చెప్పుకొచ్చారు.

చివరకు తనను వేటాడే గండం నుంచి హీరో ఎలా బయటపడతాడు ? అనేది తెలుసుకోవడానికి ప్రేక్షకుడు చివరి వరకు ఉత్కంఠతో చూస్తూ ఉండాలని.. జనాలకు, ప్రపంచానికి మంచి చేసే ఒక దేవత కోపానికి కారణమైన ఓ వ్యక్తి ఆ శాపం నుంచి ఎలా బయటపడ్డాడన్న అంశాన్ని తీసుకుని మురారి కథను డెవలప్ చేశామని అన్నారు. మహేష్ రూపం చూడగానే బృందావనం గుర్తొచ్చిందని.. అందుకే ఈ సినిమాకు ‘మురారి’ అని టైటిల్ పెట్టినట్లు తెలిపారు.

అలాగే మురారి సినిమాలోని సాంగ్స్ అన్ని సూపర్ హిట్. ఇప్పటికీ ఏదోక సందర్భంలో ఈ మూవీ సాంగ్స్ వింటుంటాం. అయితే ఈ మూవీలో క్లైమాక్స్ ముందు ఓ సాంగ్ పెట్టే విషయంలో పెద్ద స్టోరీ నడిచిందట .. ఈ సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ ‘అలనాటి రామచంద్రుడి’ పాటను వద్దన్నారట కృష్ణ. సినిమా క్లైమాక్స్ ముందు మాస్ సాంగ్ ఉండాలని.. అలనాటి రామచంద్రుడి పాట వద్దని చాలా మంది చెప్పారట. కానీ డైరెక్టర్ కృష్ణవంశి ఎవరి మాట వినకుండా పట్టుబట్టి ఈ సాంగ్ చివర్లో పెట్టారట. చివరకు డైరెక్టర్ కృష్ణవంశి మాటకే కట్టుబడి కృష్ణ ఈ సాంగ్ పెట్టడానికి ఒప్పుకున్నారట. సినిమా విడుదలైన తర్వాత అలనాటి రామచంద్రుడి పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికీ పెళ్లిళ్లలో ఇదే పాటను వింటుంటాం.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.