అలా చేయకుండా ఉంటే అతను పెద్ద హీరో అయ్యేవాడు.. ఆసక్తికర విషయం చెప్పిన విజయ భాస్కర్

సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించి దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు స్టార్ డైరెక్టర్ విజయ్ భాస్కర్. నువ్వు నాకు నచ్చవ్, మల్లీశ్వరి, మన్మధుడు ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందించి ప్రేక్షకులను అలరించారు దర్శకుడు విజయ్ భాస్కర్ .

అలా చేయకుండా ఉంటే అతను పెద్ద హీరో అయ్యేవాడు.. ఆసక్తికర విషయం చెప్పిన విజయ భాస్కర్
Tollywood

Updated on: Apr 09, 2026 | 8:35 PM

తెలుగు ఇండస్ట్రీలో కొందరు దర్శకులు ఉంటారు.. వాళ్ళు చేసింది ఎన్ని సినిమాలు అని కాదు.. ఎలాంటి సినిమాలు చేశారు అనేది మాత్రమే ప్రేక్షకులు గుర్తుపెట్టుకుంటారు. అలా మాత్రమే గుర్తుండిపోయిన ఒక దర్శకుడు కే విజయభాస్కర్. ఒకప్పుడు ఈయన పేరు సెన్సేషనల్. ఆయన పేరు పోస్టర్ మీద కనిపించింది అంటే పక్కా బ్లాక్ బస్టర్ అనే నమ్మకం ఉండేది. అప్పట్లో ఆయన చేసిన సినిమాలు కూడా అలాగే ఉన్నాయి. స్వయంవరం, నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మధుడు, మల్లీశ్వరి అంటూ మిలీనియం టైంలో బాక్సాఫీస్ తో చెడుగుడు ఆడుకున్నాడు విజయభాస్కర్. జై చిరంజీవ వరకు విజయభాస్కర్ సినిమాలు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఆయన సినిమాల స్పీడ్ తగ్గించారు. కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

జోడీ సెట్.. పెద్ది సినిమాలో చరణ్‌తో స్పెషల్ సాంగ్ చేసేది ఈ అమ్మడేనట

దర్శకుడు విజయ భాస్కర్ నటుడు తరుణ్ కెరీర్ డౌన్ అవ్వడంపై ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తరుణ్ ఒకప్పుడు యువతరం ప్రేమకథా చిత్రాలకు సంచలనం అని, అయితే అతను యాక్షన్ హీరోగా మారాల్సిన అవసరం లేదని, రొమాంటిక్ చిత్రాలు, డ్రామాలు తన బలాలు అని తాను అప్పట్లో తరుణ్‌కు సలహా ఇచ్చినట్లు విజయ భాస్కర్ వెల్లడించారు. అమితాబ్ బచ్చన్ పెద్ద సినిమాలు చేస్తున్న సమయంలో, అమోల్ పాలేకర్ చోటీ సి బాత్ వంటి చిన్న చిత్రాలతో ప్రేక్షకుల మన్ననలు పొందిన ఉదాహరణను ఆయన గుర్తు చేశారు.

వార్ని..! ఈ నటుడి భార్య ఈమేనా..!! తెలుగులో చాలా పాపులర్ నటి కదా గురూ..!!

తరుణ్ చాలా తెలివైన నటుడని, బహుశా సరైన స్క్రిప్ట్ కోసం ఎదురుచూస్తున్నాడని భాస్కర్ అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో తరుణ్‌తో కలిసి సినిమా చేసే అవకాశం స్క్రిప్ట్‌పై ఆధారపడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా, భలే దొంగలు చిత్రం బంటి ఔర్ బబ్లీ రీమేక్ కాదని, 1969 నాటి బోనీ అండ్ క్లైడ్ నుంచి స్ఫూర్తి పొందిందని స్పష్టం చేశారు. ఐశ్వర్య రాయ్ పాటను మాత్రమే స్ఫూర్తిగా తీసుకుని, మిగిలిన కథ, స్క్రీన్‌ప్లే పూర్తిగా భిన్నంగా ఉంటాయన్నారు విజయ భాస్కర్. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

ఈ విలన్ మామూలోడు కాదు..! ఎకరం భూమిని కేవలం రూ. 100 కొంటే.. ఇప్పుడు అవి రూ.100 కోట్లు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us