
మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇటీవలే భోలాశంకర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా దారుణంగా నిరాశపరిచింది. మెహర్ రమేష్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై డిజాస్టర్ అయ్యింది. దాంతో ఇప్పుడు చిరంజీవి నెక్స్ట్ సినిమా పై అంచనాలు ఏర్పడ్డాయి. చిరంజీవి ప్రస్తుతం వశిష్ఠ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వశిష్ఠ గతంలో కళ్యాణ్ రామ్ తో కలిసి బింబిసార అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయం సాధించింది.
బింబిసార సినిమాలో కళ్యాణ్ రామ్ డ్యూయల్ రోల్ లో నటించి మెప్పించారు. వశిష్ఠ తెరకెక్కిన విధానం ప్రేక్షకులను మెప్పించింది. ఇక ఇప్పుడు చిరంజీవి తో కలిసి సినిమా చేస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా అనౌన్స్ చేశారు. తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో వశిష్ఠ మాట్లాడుతూ.. ఇంట్రస్టింగ్ విషయాలు పంచుకున్నారు. వశిష్ఠ మాట్లాడుతూ.. చిన్నతనంలో చిరంజీవి గారి జగదేకవీరుడు అతిలోక సుందరి మూవీ చూసి ఎంతో ఆశ్చర్యపోయానని చెప్పుకొచ్చారు వశిష్ఠ.చిరంజీవి ఆతర్వాత అలాంటి సినిమా చేయలేదు మధ్యలో అంజి సినిమా వచ్చినా కూడా అది పూర్తిస్థాయి సోషియో ఫాంటసీ మూవీ కాదు. ఇక ఇప్పుడు నేను చేస్తున్న సినిమా పై చాలా శ్రద్ద పెట్టి చేస్తున్నా.. నా సినిమాలో డెబ్భై శాతానికి పైగా విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయని, అలాగే ఈ సినిమా ప్రేక్షకులను, అభిమానులను తప్పకుండా ఆకట్టుకుంటుందని అన్నారు. దాంతో ఇప్పుడు చిరంజీవి సినిమా పై అంచనాలు భారీగా ఎరిగిపోయాయి.
And here goes .. https://t.co/RTzgdZxhAu
— Chiranjeevi Konidela (@KChiruTweets) October 24, 2023
Bro thone biscuit ayyam, Bro Daddy tho cream biscuit avutam ankuna…
Hammaya adi lepesi #Mega156 chesaru, thanks ayya pic.twitter.com/a6TF7UWEjn
— Vishnu Anumula (@Vishnuanumula1) October 24, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.