Director Vamsy: ఆ డైరెక్టర్ ఐదుగురు అమ్మాయిలతో ఓ రాత్రి గడిపారని చెప్పాడు.. అది విని షాకయ్యా

దర్శకుడు వంశీ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్లు సాయి పల్లవి, శ్రీలీలపై ప్రశంసలు కురిపించారు. అలాగే ఇండస్ట్రీలో తన సంబంధాలు కేవలం మానసికమైనవేనని, శారీరక సంబంధాలకు దూరంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి.

Director Vamsy: ఆ డైరెక్టర్ ఐదుగురు అమ్మాయిలతో ఓ రాత్రి గడిపారని చెప్పాడు.. అది విని షాకయ్యా
Director Vamshy

Updated on: Jan 30, 2026 | 10:04 AM

టాలీవుడ్ దర్శకుడు వంశీ మంచి కథలకు పెట్టింది పేరు. పల్లెటూరు నేపధ్యంలో ఆయన తీసే సినిమాలు అద్భుతంగా ఉంటాయి. మరీ ముఖ్యంగా ఆయన రచించిన ‘మా పసలపూడి కధలు’ ఎంత సూపర్ హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లేడీస్ టైలర్, సితార, అన్వేషణ, జోకర్, ఏప్రిల్ 1 విడుదల, డిటెక్టివ్ నారద లాంటి చిత్రాలు వంశీ కెరీర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఇవే కాదు.. ఆయన తీసిన ప్రతీ సినిమా ఓ క్లాసిక్. ఆయన ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్, వ్యక్తిగత జీవితం గురించి పలు అరుదైన విషయాలను పంచుకున్నారు. సాయి పల్లవి ఓ అద్భుతమైన నటి అని.. గ్లామర్‌కు కాకుండా.. అద్భుతమైన ప్రదర్శనకే ఆమె ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. అలాగే హీరోయిన్ శ్రీలీల నటన కూడా అద్భుతంగా ఉంటుందని ప్రశంసించారు.

ఇది చదవండి: మటన్ బోటీ ఇలా తింటున్నారా.! అయితే విషంతో సమానం..

ఇండస్ట్రీలో తన బంధాలు అన్ని కూడా పూర్తిగా మానసికమైనవే తప్ప, శారీరకమైనవి కావని వంశీ స్పష్టం చేశారు. తాను ఏ హీరోయిన్‌తోనూ శారీరక సంబంధాలు పెట్టుకోలేదని, అలాంటి దృష్టితో ఎప్పుడూ చూడలేదని చెప్పారు. ఈ సందర్భంగా, ఆయన ఓ సంఘటన గుర్తు చేసుకున్నారు. ఒకసారి బ్యాంకాక్‌‌కు స్క్రిప్ట్ రైటింగ్‌కు వెళ్లినప్పుడు.. ఒక యంగ్ రైటర్ తనతో ఇలా మాట్లాడాడని చెప్పారు. ఓ రూమ్ చూపిస్తూ ‘ఒక డైరెక్టర్ ఐదుగురు అమ్మాయిలతో ఒక రాత్రి ఇక్కడ గడిపాడని చెప్పాడు’. ఆ మాటలు విని తాను షాక్ అయ్యానని.. అలాంటి ప్రవర్తనను తాను ఎంతమాత్రం సహించలేనని, తాను ఆ రకమైన వ్యక్తిని కాదని వంశీ చెప్పారు.

ఇవి కూడా చదవండి

తాను ప్రేమించిన ఒక వ్యక్తిని ఇప్పటికీ మర్చిపోలేదని, ఆమె జ్ఞాపకాలు శాశ్వతంగా తన మనసులో నిలిచి ఉన్నాయని తెలిపారు. అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ ఆ జ్ఞాపకాలే తనతో ఉంటాయని, మళ్ళీ ఇంకొక అడుగు ముందుకు వేయలేదని చెప్పుకొచ్చారు. ఆ జ్ఞాపకాలే తనకు ఆనందాన్ని ఇస్తాయని, ఆ గతం నిజం కావాలని తాను ఎప్పుడూ కోరుకోనని పేర్కొన్నారు. జమున ఫోటోతో పాటు, “జమున గారు లేకపోయినా, ఆ మూగ మనసుల్లో గౌరి నా గుండెల్లోనే ఉంది” అని తాను రాసిన ఒక పోస్ట్ గురించి ప్రస్తావించారు వంశీ. అలాగే, బిస్కెట్ అమ్ముకునే ఒక తమిళ వ్యక్తి ఫోటో పెట్టి, తన బాల్యంలో పసలపూడికి వచ్చే రామారావును గుర్తు చేసుకుంటూ రాసిన పోస్ట్ ప్రజల్లోకి తప్పుగా వెళ్లిందని.. తాను చెప్పాలనుకున్న విషయాన్నీ సరిగ్గా చెప్పకపోవడం వల్ల కొందరు దానిని వివాదాస్పదంగా చూశారని వంశీ తెలిపారు.

ఇది చదవండి: జబర్దస్త్‌లో సుధీర్, హైపర్ ఆది కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నది అతడే..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..