Nithiin: టాలెంటెడ్ హీరో మాస్టర్ ప్లాన్.. ఇటలీలో రెండు ప్రాజెక్ట్స్ చేస్తోన్న నితిన్ ?..

పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్‏లో రూపొందుతున్న ఈ మూవీ నితిన్ కలెక్టర్ పాత్రలో నటించనున్నారని సమాచారం.

Nithiin: టాలెంటెడ్ హీరో మాస్టర్ ప్లాన్.. ఇటలీలో రెండు ప్రాజెక్ట్స్ చేస్తోన్న నితిన్ ?..
Nithiin

Updated on: May 19, 2022 | 3:12 PM

టాలెంటెడ్ హీరో నితిన్ (Nithiin) ప్రస్తుతం మాచర్ల నియోజకవర్గం (Macherla Niyojakavargam ) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా.. నితిన్ సొంత బ్యానర్ శ్రేష్ మూవీస్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్‏లో రూపొందుతున్న ఈ మూవీ నితిన్ కలెక్టర్ పాత్రలో నటించనున్నారని సమాచారం. ఇప్పటికే చాలావరకు షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం ఇటలీలో తదుపరి షెడ్యూల్ జరుపుకుంటున్నట్లుగా సమాచారం. ఈ మూవీలోని 3 పాటలను చిత్రీకరీంచేందుకు చిత్రయూనిట్ ఇటలీ వెళ్లినట్లుగా టాక్ వినిపిస్తోంది.

అయితే అక్కడ కూడా షూటింగ్ సజావుగా సాగుతుండగా.. పాటలకు.. సన్నివేశాలకు మధ్య భారీగా గ్యాప్ వచ్చేస్తుందట. దీంతో ఒక్క సినిమాకే సమయం వృథా అవుతుందని భావించిన నితిన్..తన తదుపరి ప్రాజెక్ట్‏పై దృష్టి పెట్టాడట. ఇందులో భాగంగా.. తన నెక్ట్స్ సినిమా డైరెక్టర్ వక్కంతం వంశీని.. హీరోయిన్ శ్రీలీలను ఇటలీకి రప్పించి అక్కడే షూటింగ్ షూరు చేసినట్లుగా సమాచారం. నితిన్, శ్రీలీలపై ఒకటి రెండు పాటలను ఇటలీలో చిత్రీకరించేందుకు కెమెరామెన్, కొరియోగ్రాఫర్ సైతం ఇటలీ వెళ్లారట. దీంతో ఒకేసారి రెండు ప్రాజెక్టులకు సంబంధించిన కీలక సన్నివేశాలు, సాంగ్స్ షూటింగ్ కంప్లీట్ అవుతుందని భావించారట…త్వరలోనే ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఇక మాచర్ల నియోజకవర్గం సినిమాలో నితిన్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేశాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us