
కొరియోగ్రాఫర్ గా కెరీర్ ప్రారంభించిన తేజ ఆ తర్వాత డైరెక్టర్ గా మారారు. తెలుగులో పలు సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించారు. ఉదయ్ కిరణ్ తో చిత్రం, నువ్వునేను, నితిన్ తో జయం వంటి యూత్ ఫుల్ లవ్ స్టోరీలను ఆడియెన్స్ కు అందించాడు తేజ. ఫ్యామిలీ సర్కస్, నిజం, జై, ధైర్యం, ఔనన్నా కదన్నా, ఒక విచిత్రం, లక్ష్మీ కల్యాణం, కేక, నీకు నాకు డ్యాష్ డ్యాష్, వేయి అబద్దాలు, హోరా హోరీ, సీత, నేనే రాజు నేనే మంత్రి వంటి సినిమాలను కూడా తెరకెక్కించాడు తేజ. అయితే ఇందులో నేనే రాజు నేనే మంత్రి సినిమా మాత్రమే పెద్దగా ఆడింది. తేజ దర్శకత్వంలో చివరిగా వచ్చిన అహింస సినిమా కూడా పెద్దగా ఆడలేదు. 2023లో రిలీజైన ఈ సినిమా ప్లాఫ్ గా నిలిచింది. ప్రస్తుతం తన తర్వాతి సినిమా పనుల్లో బిజీగా ఉన్న తేజ ఆ మధ్యన ఒక ఇంటర్వ్యూకు హాజరయ్యారు. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా కెరీర్ ప్రారంభ దశలో తేజ ఎదుర్కొన్న ఇబ్బందులు, కుటుంబ జీవితం, పెళ్లి, పిల్లల భవిష్యత్తు వంటి అంశాలపై మాట్లాడారు.
కాగా తన వివాహం గురించి మాట్లాడిన తేజ, తన పెళ్లిని అక్కినేని వెంకట్, ఆయన భార్య జ్యోత్స్న దగ్గరుండి జరిపించారని తెలిపారు. అలాగే అక్కినేని నాగేశ్వరరావు కుటుంబ పెద్దగా వ్యవహరించారని గుర్తుచేసుకున్నారు. ‘ అప్పుడు నేను ఉండడానికి ఒక ఇల్లు కూడా ఉండేది కాదు. పెళ్లికి ముందు అన్నపూర్ణ స్టూడియోలోని ఒక కాటేజ్ లో ఉండేవాడిని. అయితే అక్కినేని జ్యోత్స్న మాత్రం పెళ్లికి ముందు ఒక ఇల్లు తీసుకోమని చెప్పింది. దాంతో పెళ్లికి 15 రోజులు ముందే ఒక అద్దె ఇల్లు తీసుకున్నాను. పెళ్లికి ఒక వారం ముందు ఒక కారు కూడా కొనుక్కున్నాను’ అని తేజ చెప్పుకొచ్చారు.
కాగా అక్కినేని ఫ్యామిలీతో తేజకు మంచి అనుబంధం ఉంది. చాలా సంవత్సరాల పాటు వాళ్ల ఫ్యామిలీ మెంబర్ లాగా ఉండిపోయాడు. అందువల్లే వాళ్లే పెళ్లి పెద్దలుగా వ్యవహరించి పెళ్లి చేశారంటూ తేజ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.