Director Sukumar: బాబోయ్.. ఫ్యాషన్ షోలో ర్యాంప్ వాక్ అదరగొట్టిన సుకుమార్ డాటర్.. ఫోటోస్ చూశారా..?

|

Jun 25, 2024 | 10:11 AM

ఎన్నో హిట్ చిత్రాలను అందించిన సుకుమార్.. ఇప్పుడు పుష్ప మూవీతో పాన్ ఇండియా డైరెక్టర్ గా క్రేజ్ అందుకున్నారు. ప్రస్తుతం పుష్ప 2 చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. నిజానికి డైరెక్టర్స్ ఫ్యామిలీ గురించి జనాలకు అంతగా తెలియదు. కానీ ఈ మధ్య సుకుమార్ ఫ్యామిలీ ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ముఖ్యంగా ఆయన కూతురు సుకృతి గురించి ఏదోక న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది.

Director Sukumar: బాబోయ్.. ఫ్యాషన్ షోలో ర్యాంప్ వాక్ అదరగొట్టిన సుకుమార్ డాటర్.. ఫోటోస్ చూశారా..?
Director Sukumar
Follow us on

డైరెక్టర్ సుకుమార్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆర్య సినిమాతో దర్శకుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టి మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నారు. అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన ఆర్య సినిమా అప్పట్లో యూత్‏ను ఆకట్టుకుంది. ఆ తర్వాత ఎన్నో హిట్ చిత్రాలను అందించిన సుకుమార్.. ఇప్పుడు పుష్ప మూవీతో పాన్ ఇండియా డైరెక్టర్ గా క్రేజ్ అందుకున్నారు. ప్రస్తుతం పుష్ప 2 చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ మూవీని ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేయనున్నట్లు ఇదివరకే చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ సినిమాపై పాన్ ఇండియా మూవీ లవర్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇదిలా ఉంటే. నిజానికి డైరెక్టర్స్ ఫ్యామిలీ గురించి జనాలకు అంతగా తెలియదు. కానీ ఈ మధ్య సుకుమార్ ఫ్యామిలీ ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ముఖ్యంగా ఆయన కూతురు సుకృతి గురించి ఏదోక న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది.

ఇటీవలే ఓ షార్ట్ ఫిల్మ్ లో నటించిన సుకృతి.. తన నటనకు ఏకంగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ అందుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరలయ్యాయి. ఇక ఆ తర్వాత సుకృతి కూడా నటిగా మంచి గుర్తింపు తెచ్చుకోవడం ఖాయమని.. త్వరలోనే ఆమె ఇండస్ట్రీ ఎంట్రీ ఉంటుందని అంతా అనుకున్నారు. ఇక అందుకు తగ్గట్టుగానే సుకృతికి సంబంధించిన మరో న్యూస్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. తాజాగా సుకృతి ఓ ఫ్యాషన్ షోలో పాల్గొంది.

మొదటి నుంచి సుకృతికి సినిమా, ఫ్యాషన్ రంగంపై ఇంట్రెస్ట్ ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ఓ ఫ్యాషన్ షోలో మోడ్రన్ డ్రెస్ లో ర్యాంప్ వాక్ చేసి అదరగొట్టింది. ఆ ఫోటోస్ నెట్టింట షేర్ చేసింది సుకృతి. ఫస్ట్ టైమ్ ఫ్యాషన్ మోడల్ గా ఫ్యాషన్ షోకు పనిచేయడం గర్వంగా ఉందంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం సుకృతి షేర్ చేసిన ఫోటోస్ వైరల్ గా మారగా.. బార్బీ డాల్.. వాకింగ్ స్వాగ్ అదిరింది.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.