తమిళ్ స్టార్ హీరో సూర్య నటించిన ఆకాశమే నీ హద్దురా చిత్రం భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో డైరెక్టర్ సుధా కొంగర పేరు మారుమోగిపోయింది. సౌత్ టూ నార్త్ సినీ ప్రియుల మనసులలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు సుధా కొంగర. అయితే కొద్దిరోజులుగా ఆమె.. ప్రఖ్యాత పారిశ్రామిక వేత్తలో ఒకరైన రతన్ టాటా బయోపిక్ తెరకెక్కించనున్నట్లుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ వార్తలపై సుధా కొంగర స్పందించారు. “ఈ వార్తల్లో నిజం లేదని కొట్టిపడేసింది. నేను రతన్ టాటాకు వీరాభిమానని… కానీ ప్రస్తుతం ఆయన బయోపిక్ తెరకెక్కించే ఆలోచన లేనట్లు తెలిపింది. త్వరలోనే తన కొత్త సినిమా వివరాలను అధికారికంగా వెల్లడిస్తానని” చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె హిందీలో ఆకాశమే నీ హద్దురా సినిమాను చేస్తున్నారు. ఇందులో అక్షయ్ కుమార్ నటిస్తున్నారు.
ఇక లేటేస్ట్ సమాచారం ప్రకారం ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్ బ్యానర్ లో మహానటి కీర్తి సురేష్ నటించనున్న లేడీ ఓరియోంటెడ్ చిత్రానికి సుధా కొంగర దర్శకత్వం వహించనున్నారట. ఇండస్ట్రీలో ఉన్న అతి కొద్ది మంది లేడీ దర్శకులలో సుధా కొంగర ఒకరు.
బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కించిన గురు సినిమాతో ఫిల్మ్ ఫేర్ అందుకున్నారు సుధ కొంగరా. అనంతరం.. ఆకాశమే నీ హద్దురా సినిమాతో ఏకంగా నేషనల్ అవార్డ్ సొంతం చేసుకోవడమే కాకుండా.. దేశవ్యాప్తంగా అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకున్నారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.