AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RC 15: చరణ్.. శంకర్ సినిమా పై ఇంట్రెస్టింగ్ బజ్.. ఫస్ట్ లుక్ రిలీజ్‏కు మాస్టర్ ప్లాన్..

చెర్రీ.. తన తదుపరి ప్రాజెక్టును పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్నట్లు ప్రకటించినప్పటి నుంచి ఈ మూవీ అంచనాలు అంతకంతకు పెరుగుతున్నాయి.

RC 15: చరణ్.. శంకర్ సినిమా పై ఇంట్రెస్టింగ్ బజ్.. ఫస్ట్ లుక్ రిలీజ్‏కు మాస్టర్ ప్లాన్..
Ram Charan
Rajitha Chanti
|

Updated on: May 22, 2022 | 1:29 PM

Share

ఆర్ఆర్ఆర్ సినిమా పాన్ ఇండియా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)… కేవలం దక్షిణాదిలోనే కాకుండా.. ఉత్తరాదిలోనూ చరణ్, తారక్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమా తర్వాత చరణ్ నటించబోయే సినిమాపై భారీగానే అంచనాలు ఏర్పడ్డాయి.. ఈక్రమంలో చెర్రీ.. తన తదుపరి ప్రాజెక్టును పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్నట్లు ప్రకటించినప్పటి నుంచి ఈ మూవీ అంచనాలు అంతకంతకు పెరుగుతున్నాయి. చరణ్ కెరీర్‏లో 15వ చిత్రంగా రాబోతున్న ఈ సినిమా గురించి ఎప్పటికప్పుడు గాసిప్స్, అప్డేట్స్ నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా.. గత కొద్ది రోజులుగా ఆర్సీ 15 సినిమాకు సంబంధించి చరణ్ స్టిల్స్, వీడియోస్ సోషల్ మీడియాలో లీక్ అవుతున్నాయి. ఈ విషయంలో మేకర్స్ ఎంతటి నిబంధనలు పెట్టినప్పటికీ లీక్స్ మాత్రం తగ్గడం లేదు.. తాజాగా ఈ మూవీ నుంచి మరో ఇంట్రెస్టింగ్ బజ్ ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తోంది.

డైరెక్టర్ శంకర్.. రామ్ చరణ్ కాంబోలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ కోసం ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ పై ఓ వార్త ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. ఈ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ కోసం శంకర్ మాస్టార్ ప్లాన్ సిద్ధం చేశారట. తన మార్క్‏లోనే పోస్టర్ రిలీజ్ చేసేందుకు క్రేజీ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారట. ఆగస్ట్ నెలలో ఈ ఈవెంట్ కన్ఫార్మ్ కానుందని.. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ వేడుకను నిర్వహించినున్నారట. కేవలం ఫస్ట్ లుక్ కోసం ప్రత్యేకంగా ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారట శంకర్.. ఈ సినిమాలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తుండగా.. ప్రొడ్యూసర్ దిల్ రాజు బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

Follow Us
తల్లి కోసం బిడ్డల్లా.. ఈమె కోసం సొర చేపలు ఎదురుచూస్తాయి!
తల్లి కోసం బిడ్డల్లా.. ఈమె కోసం సొర చేపలు ఎదురుచూస్తాయి!
డ్రైవర్‌ను అడ్డం పెట్టుకుని కూతురు అకౌంట్‌కు లంచాలు..
డ్రైవర్‌ను అడ్డం పెట్టుకుని కూతురు అకౌంట్‌కు లంచాలు..
మిత్రుడి పార్దివదేహాన్ని చూడగానే చిరంజీవి ఎమోషనల్..
మిత్రుడి పార్దివదేహాన్ని చూడగానే చిరంజీవి ఎమోషనల్..
సెప్టెంబర్ లక్కీ రాశులు.. బాబోయ్ వీరి ఇంట ఇక డబ్బుల వర్షమే
సెప్టెంబర్ లక్కీ రాశులు.. బాబోయ్ వీరి ఇంట ఇక డబ్బుల వర్షమే
1983 జీవితఖైదు, 2004లో బెస్ట్ టీచర్ అవార్డ్‌! అసలు ట్విస్ట్
1983 జీవితఖైదు, 2004లో బెస్ట్ టీచర్ అవార్డ్‌! అసలు ట్విస్ట్
అక్టోబర్ తర్వాత రాజుల్లా బతికే రాశులివే.. అందులో మీ రాశి ఉందా?
అక్టోబర్ తర్వాత రాజుల్లా బతికే రాశులివే.. అందులో మీ రాశి ఉందా?
మీరు మొదటిసారి హెలికాప్టర్‌లో ఎక్కితే ఈ తప్పులు అస్సలు చేయకండి
మీరు మొదటిసారి హెలికాప్టర్‌లో ఎక్కితే ఈ తప్పులు అస్సలు చేయకండి
Numerology: ఈ తేదీల్లో పుట్టిన అన్నదమ్ములుంటే అదృష్టమే..!
Numerology: ఈ తేదీల్లో పుట్టిన అన్నదమ్ములుంటే అదృష్టమే..!
మీ ఫోన్ మాటిమాటికీ హ్యాంగ్ అవుతుందా.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో మళ్లీ
మీ ఫోన్ మాటిమాటికీ హ్యాంగ్ అవుతుందా.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో మళ్లీ
అమ్మ కోసం కొడుకు ఎదురుచూపులు.. కన్నీళ్లు తెప్పించే విషాదం!
అమ్మ కోసం కొడుకు ఎదురుచూపులు.. కన్నీళ్లు తెప్పించే విషాదం!