Shankar: శంకర్‌తో సినిమా అంటే మామూలుగా ఉండదు మరి.. నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్న టాప్ డైరెక్టర్

తాజాగా గేమ్ ఛేంజర్‌లో పాటల కోసమే భారీ బడ్జెట్ పెట్టిస్తున్నారు. అసలు శంకర్‌కు ఈ ఖరీదైన పాటలపై అంత ఇష్టమెందుకు..? ఆయన కెరీర్‌లో అలాంటి పాటలెన్ని ఉన్నాయి..? శంకర్‌తో సినిమా అంటే మామూలుగా ఉండదు మరి.. అందరిలా ఆయన కూడా సినిమా చేస్తే స్పెషల్ ఏముంటుంది..? అందుకే శంకర్ అంటే ఎప్పటికీ గుర్తుండేలా పాటల కోసమే ఎక్కువ ఖర్చు పెట్టిస్తుంటారు. ఇప్పుడు చరణ్‌తో పాటు కమల్ హాసన్ సినిమాల కోసం ఇదే చేస్తున్నారీయన.

Shankar: శంకర్‌తో సినిమా అంటే మామూలుగా ఉండదు మరి.. నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్న టాప్ డైరెక్టర్
Shankar

Edited By: Rajeev Rayala

Updated on: Aug 07, 2023 | 9:35 AM

ఆయన సినిమాలో ఒక్క పాటకయ్యే ఖర్చుతో మూడు చిన్న సినిమాలు తీయొచ్చు..! దర్శకుడు శంకర్‌పై ఇండస్ట్రీలో కామన్‌గా జరిగే చర్చ ఇది. దాన్ని మరోసారి నిజం చేస్తున్నారు ఈయన. తాజాగా గేమ్ ఛేంజర్‌లో పాటల కోసమే భారీ బడ్జెట్ పెట్టిస్తున్నారు. అసలు శంకర్‌కు ఈ ఖరీదైన పాటలపై అంత ఇష్టమెందుకు..? ఆయన కెరీర్‌లో అలాంటి పాటలెన్ని ఉన్నాయి..? శంకర్‌తో సినిమా అంటే మామూలుగా ఉండదు మరి.. అందరిలా ఆయన కూడా సినిమా చేస్తే స్పెషల్ ఏముంటుంది..? అందుకే శంకర్ అంటే ఎప్పటికీ గుర్తుండేలా పాటల కోసమే ఎక్కువ ఖర్చు పెట్టిస్తుంటారు. ఇప్పుడు చరణ్‌తో పాటు కమల్ హాసన్ సినిమాల కోసం ఇదే చేస్తున్నారీయన. ఇటు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, అటు కమల్ హాసన్ తో ఇండియన్ 2 కోసం నిర్మాతల ఆస్తులు కరిగిస్తున్నారు శంకర్.

తగ్గేదే లే.. డైలాగ్ అల్లు అర్జున్ చెప్పారు కానీ దీనికి నిలువెత్తు నిదర్శనం మాత్రం దర్శకుడు శంకర్. 30 ఏళ్ళుగా ఇదే మాటపై ఉన్నారు ఈ దర్శకుడు. మధ్యలో ఫ్లాపులొచ్చినా మారలేదు.. తన వర్కింగ్ స్టైల్ మార్చుకోలేదు. ముఖ్యంగా పాటల చిత్రీకరణలో శంకర్ శైలి ప్రత్యేకం. ఒక్కో పాట కోసం కోట్లకు కోట్లు ఖర్చు చేయిస్తుంటారు శంకర్. తాజాగా గేమ్ ఛేంజర్‌లో 5 పాటల కోసం 90 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తుంది.

గతేడాది న్యూజిలాండ్‌లో వారం రోజుల పాటు షూట్ చేసిన ఓ పాటకు ఏకంగా 15 కోట్లు పెట్టించారు శంకర్. ఈ బడ్జెట్‌తో రెండు మూడు చిన్న సినిమాలు తీయొచ్చు. అత్యంత లావిష్‌గా ఉండేలా చరణ్ సినిమాలో పాటను డిజైన్ చేసారు శంకర్. గేమ్ ఛేంజర్‌లో జానీ, ప్రేమ్ రక్షిత్, గణేష్ ఆచార్య, ప్రభుదేవా పాటలు కొరియోగ్రఫీ చేస్తున్నారు. గతంలోనూ 2.0లో ఎంతిర లోకపు సుందరివే పాటకు దాదాపు 8 కోట్లు ఖర్చు పెట్టించారు. రోబోలో అరిమో అరిమో పాటకు అప్పట్లోనే 5 కోట్ల బడ్జెట్ పెట్టారు.

శంకర్ సినిమా ఎంత గ్రాండ్‌గా ఉంటుందో.. పాటలు అంతకంటే గ్రాండియర్‌గా ఉంటాయి. ప్రేమికుడులో ముక్కాలా ముక్కాబులా అయినా.. జీన్స్‌ సినిమాలో ప్రపంచ ఏడు వింతలను చూపించే అతిశయమే పాటైనా.. అపరిచితుడులో రెమో రెమో అయినా.. ఏదైనా శంకర్ మార్క్ కనిపిస్తుంది. శివాజీ సినిమాలో సహానా శ్వాసై పాట కోసం 2007లోనే 2 కోట్లు ఖర్చు చేయించారు శంకర్. ఇప్పుడు గేమ్ ఛేంజర్, ఇండియన్ 2కు ఈ ఖర్చు ఇంకా పెరిగింది.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..