AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Devil: డెవిల్ మూవీ క్రేజీ అప్డేట్.. ప్రేక్షకుల ముందుకు వచ్చేది ఎప్పుడంటే

బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న కళ్యాణ్ రామ్ త్వరలో డెవిల్ అనే సినిమా చేస్తున్నారు. హిట్ కోసం చాలా కష్టపడుతున్నారు కళ్యాణ్ రామ్. కమర్షియల్ సినిమాలతో పాటు  ప్రయోగాత్మక సినిమాల్లోనూ నటించి మెప్పించారు కళ్యాణ్ రామ్. ఈ మధ్య కాలంలో బింబిసార సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ఆతర్వాత చేసిన అమిగోస్ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. అమిగోస్ సినిమాలో త్రిపాత్రాబినయం చేశారు కళ్యాణ్ రామ్.

Devil: డెవిల్ మూవీ క్రేజీ అప్డేట్.. ప్రేక్షకుల ముందుకు వచ్చేది ఎప్పుడంటే
Devil
Rajeev Rayala
|

Updated on: Aug 07, 2023 | 8:55 AM

Share

హిట్లు, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నారు నందమూరి కళ్యాణ్ రామ్. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న కళ్యాణ్ రామ్ త్వరలో డెవిల్ అనే సినిమా చేస్తున్నారు. హిట్ కోసం చాలా కష్టపడుతున్నారు కళ్యాణ్ రామ్. కమర్షియల్ సినిమాలతో పాటు  ప్రయోగాత్మక సినిమాల్లోనూ నటించి మెప్పించారు కళ్యాణ్ రామ్. ఈ మధ్య కాలంలో బింబిసార సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ఆతర్వాత చేసిన అమిగోస్ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. అమిగోస్ సినిమాలో త్రిపాత్రాబినయం చేశారు కళ్యాణ్ రామ్. ఇక ఇప్పుడు డెవిల్ అనే మరో వైవిధ్యమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకు ‘ది బ్రిటీష్‌ సీక్రెట్‌ ఏజెంట్‌’ అనేది క్యాప్షన్.

కళ్యాణ్ రామ్..

నందమూరి కళ్యాణ్ రామ్ చైల్డ్ ఆర్టిస్ట్ గాను నటించి మెప్పించారు. బాలకృష్ణ నటించిన బాల గోపాలుడు సినిమాలో నటించారు కళ్యాణ్ రామ్. ఆతర్వాత తొలిచూపులోనే అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు ఆతర్వాత ఆయన వరుస సినిమాలు చేసి ఆకట్టుకున్నారు. 2005లో వచ్చిన అతనొక్కడే అనే సినిమాతో తొలి సూపర్ హిట్ అందుకున్నాడు కళ్యాణ్ రామ్. ఆతర్వాత 2015లో వచ్చిన పటాస్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆతర్వాత మళ్లీ ఫ్లాప్ లు పలకరించాయి. 2022లో వచ్చిన బింబిసార సినిమాతో హిట్ కొట్టారు. ఇక ఇప్పుడు డెవిల్ గా రానున్నాడు కళ్యాణ్ రామ్.

డెవిల్

నవీన్ మేడారం దర్శకత్వంలోతెరకెక్కుతోన్న డెవిల్ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గ నటిస్తుంది. డెవిల్ మూవీని నవంబరు 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో బ్రిటీష్‌ సీక్రెట్‌ ఏజెంట్‌గా కనిపించనున్నారు కళ్యాణ్ రామ్. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదల చేసిన పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. అలాగే ఈ మూవీ గ్లింప్స్ సినిమా పై అంచనాలను పెంచేసింది. పిరియాడికల్ డ్రామా కావడంతో విజువల్స్ పరంగా ఆకట్టుకుంది. అప్పటి పరిస్థితులను అద్భుతంగా చూపించారు. ఈ సినిమాలో అంతుచిక్కని ఓ రహస్యాన్ని ఛేదించే బ్రిటీష్‌ సీక్రెట్‌ ఏజెంట్‌ గా కళ్యాణ్ రామ్ ఏం చేస్తారు అన్నది చూడాలి. ఈసినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని అంటున్నారు నందమూరి ఫ్యాన్స్. ఈ సినిమా తర్వాత బింబిసార 2 ఉండే అవకాశం ఉంది.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?