ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా భారీ క్రేజ్ సంపాదించుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan). ఈ మూవీలో చెర్రీ నటనకు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ ప్రస్తుతం సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆర్సీ 15 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే గత కొంతకాలంగా ఈ ప్రాజెక్ట్ నుంచి ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో చరణ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా డైరెక్టర్ శంకర్ తన ట్విట్టర్ వేదికగా ఆర్సీ 15 అప్డేట్ ఇచ్చారు.
ప్రస్తుతం తాను కమల్ హాసన్ ఇండియన్ 2 సినిమాతోపాటు రామ్ చరణ్ ఆర్సీ 15 చిత్రం కూడా షూటింగ్ చేస్తున్నాను. రెండు సినిమాలు ఒకేసారి షూటింగ్ జరుపుకుంటున్నాయని… ఇక చరణ్ సినిమా షూటింగ్ నెక్ట్ షెడ్యూల్ త్వరలోనే హైదరబాద్, విశాఖపట్నంలో జరగనుందని తెలిపారు. సెప్టెంబర్ మొదటి వారంలో ఆర్సీ 15 తదుపరి షెడ్యూల్ స్టార్ట్ చేస్తు్న్నామంటూ ట్వీట్ చేశారు శంకర్. దీంతో చెర్రీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుండగా సీనియర్ హీరో శ్రీకాంత్ కీలకపాత్రలో కనిపించనున్నాడు. పొలిటికల్ నేపథ్యంలో ఈ మూవీ రాబోతున్నట్లుగా టాక్ వినిపిస్తుంది.
ట్వీట్..
Hi Everyone, Indian 2 and #RC15 will be shot simultaneously. Ready to shoot the next schedule of #RC15 from first week of September in Hyderabad and Vizag! @DilRajuOfficial @AlwaysRamCharan @SVC_official. pic.twitter.com/20yYQGxIgE
— Shankar Shanmugham (@shankarshanmugh) August 24, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.