ఇప్పుడున్న హీరోయిన్లలో ఆ ఇద్దరూ చాలా స్పెషల్.. వాళ్ల బిహేవియర్ అంటే ఇష్టం.. శేఖర్ కమ్ముల..

దర్శకుడు శేఖర్ కమ్ముల తన అభిమాన హీరోయిన్ల గురించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అవే కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. గతంలో ఒక హీరోయిన్ యాక్టింగ్, ప్రవర్తన ప్రశంసించిన ఆయన, ప్రస్తుతం మరో తార సైతం తన అభిమాన నటిగా పేర్కొన్నారు. నటిగానే కాకుండా, ఆమె వ్యక్తిత్వాన్ని, సమస్యలపై స్పందించే తీరును శేఖర్ కమ్ముల మెచ్చుకున్నారు.

ఇప్పుడున్న హీరోయిన్లలో ఆ ఇద్దరూ చాలా స్పెషల్.. వాళ్ల బిహేవియర్ అంటే ఇష్టం.. శేఖర్ కమ్ముల..
Sekhar Kammula

Updated on: Jun 12, 2026 | 12:02 PM

దర్శకుడు శేఖర్ కమ్ముల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ముఖ్యంగా ఆయన సినిమాలకు తెలుగులో విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది. యూత్ ను ఆకర్షించే సినిమాలను తెరకెక్కించడంలో ఆయనకు సాటిలేరు. ఇటీవలే కుబేర సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. ఇందులో ధనుష్, రష్మిక మందన్నా, నాగార్జున ముఖ్య పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. గతంలో ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ తన అభిమాన హీరోయిన్ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన చిత్రాలలో హీరోయిన్లను అందంగా, డామినేటివ్ గా చూపించే దర్శకుడిగా పేరున్న శేఖర్ కమ్ములను, ప్రస్తుతం సక్సెస్ లో ఉన్న హీరోయిన్లలో ఆయన అభిమాన నటి ఎవరు అని ప్రశ్నించగా, ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు.

ఎక్కువమంది చదివినవి : Sridevi Vijaykumar : ఇప్పుడున్న హీరోలలో అతడంటే పిచ్చి ఇష్టం.. అతడే నా ఫేవరేట్.. హీరోయిన్ శ్రీదేవి విజయ్ కుమార్..

గతంలో తాను ఛార్మిని చాలా ఇష్టపడేవాడినని శేఖర్ కమ్ముల వెల్లడించారు. “ఛార్మి చాలా.. ఐ థాట్ లైవ్ వైర్ లా ఆమె. ఐ లైక్ హర్ పర్సనాలిటీ. ఐ లైక్ ద వే షీ.. ఆమె నాకెందుకో చాలా బోల్డ్ అనిపిస్తది” అని ఆమె గురించి ప్రశంసించారు. అయితే, ప్రస్తుతం తన అభిమాన నటి సమంత అని ఆయన స్పష్టం చేశారు. సమంత గురించి మాట్లాడుతూ, ఆమె ఆఫ్-స్క్రీన్ పర్సనాలిటీ, సమస్యల పట్ల ఆమె స్పందించే తీరును శేఖర్ కమ్ముల ప్రత్యేకంగా పేర్కొన్నారు. “ఆమె కేవలం ఒక నటి మాత్రమే కాదు, ఆమెకు ఒక బలమైన వ్యక్తిత్వం ఉంది” అని అన్నారు.. ఈ వ్యాఖ్యలు శేఖర్ కమ్ముల దృష్టిలో నటీమణుల నటనతో పాటు వారి వ్యక్తిత్వానికి కూడా ఇచ్చే ప్రాధాన్యతను తెలియజేస్తున్నాయి.

ఎక్కువమంది చదివినవి : Mahesh Babu: మహేష్ ఇమేజ్‏కు ఆ సినిమా కరెక్ట్ కాదు.. నేను వినుంటే వద్దనేవాడిని.. సూపర్ స్టార్ కృష్ణ..

ప్రస్తుతం ఛార్మి సినిమాలకు దూరంగా ఉంటూ నిర్మాణ రంగంలో సక్సెస్ అయ్యారు. డైరెక్టర్ పూరితో కలిసి నిర్మాణ సంస్థను ప్రారంభించిన ఛార్మి పలు చిత్రాలు నిర్మిస్తుంది. మరోవైపు కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న సమంత.. ఇప్పుడు మా ఇంటి బంగారం మూవీతో అలరించేందుకు రెడీ అయ్యింది. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ఆక్టటుకున్నాయి.

ఎక్కువమంది చదివినవి : Trending Song : ఏం పాట మావ.. 22 సంవత్సరాలుగా యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న లవ్ సాంగ్.. అమ్మాయిలు పిచ్చెక్కిపోయారు

 

ఎక్కువమంది చదివినవి : Jai Chiranjeeva: చిరంజీవి మేనకోడలు ఇంత మారిపోయింది మావా.. ? గ్లామరస్ లుక్కులో అదిరిపోయిన జై చిరంజీవి చైల్డ్ ఆర్టిస్ట్..

Follow Us