Ram Gopal Varma: ఆర్జీవీ సంచలన ప్రకటన.. తమ అసలు వ్యూహం ఇదేనట.. వాటే స్కెచ్

ఇక శపథం సినిమా శుక్రవారం రిలీజ్‌ చేస్తామని వర్మ ప్రకటించినా ఇప్పటిదాకా ప్రమోషన్స్ ఏమీ లేకపోవడంతో వాయిదా పడుతుందని అనుకున్నారు. కానీ వర్మ వ్యూహం ప్రకారం ముందుకెళ్తున్నట్లు ప్రకటించారు. వ్యూహం, శపథం సినిమాల వెనుక అసలు వ్యూహం సైడ్‌ బై సైడ్‌ వెబ్ సిరీస్‌ కూడా తియ్యడం అని తెలిపారు. వేర్వెరు అడ్డంకుల మూలాన తప్పనిసరి పరిస్థితుల్లో సెన్సార్ బోర్డు అనుమతించిన వెర్షన్ మాత్రమే థియేటర్లలో రిలీజ్ చెయ్యడం జరిగింది

Ram Gopal Varma: ఆర్జీవీ సంచలన ప్రకటన.. తమ అసలు వ్యూహం ఇదేనట.. వాటే స్కెచ్
Ram Gopal Varma Vyuham, sapatham Movies

Updated on: Mar 07, 2024 | 6:48 PM

నిత్యం సంచలన వార్తల్లో నిలిచే డైరెక్టర్‌ రాంగోపాల్‌వర్మ మరో ప్రకటనతో ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్‌ చెప్పారు. ఏపీ సీఎం జగన్ ప్రధానంగా వ్యూహం, శపథం సినిమాలు చేసున్నట్టు ప్రకటించారు. అందులో వ్యూహం సినిమా ఎన్నో వాయిదాల తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక శపథం సినిమా శుక్రవారం రిలీజ్‌ చేస్తామని వర్మ ప్రకటించినా ఇప్పటిదాకా ప్రమోషన్స్ ఏమీ లేకపోవడంతో వాయిదా పడుతుందని అనుకున్నారు. కానీ వర్మ వ్యూహం ప్రకారం ముందుకెళ్తున్నట్లు ప్రకటించారు. వ్యూహం, శపథం సినిమాల వెనుక అసలు వ్యూహం సైడ్‌ బై సైడ్‌ వెబ్ సిరీస్‌ కూడా తియ్యడం అని తెలిపారు. వేర్వెరు అడ్డంకుల మూలాన తప్పనిసరి పరిస్థితుల్లో సెన్సార్ బోర్డు అనుమతించిన వెర్షన్ మాత్రమే థియేటర్లలో రిలీజ్ చెయ్యడం జరిగింది.. కానీ ఇప్పుడు తాము ఫస్ట్ నుంచి రెడీ చేసి పెట్టుకున్న వెబ్ సిరీస్ శపథం ఆరంభం చాప్టర్ 1ని మార్చి 7న గురువారం రాత్రి 8 గంటలకు, అలాగే శపథం అంతం చాప్టర్ 2 ని మార్చి 8న శుక్రవారం రాత్రి 8 గంటలకి ఏపీ ఫైబర్‌నెట్ లో ఓటీటీ యాప్ ద్వారా పే పర్ వ్యూలో చూసుకోవడానికి అవకాశం కలిపిస్తామని చెప్పారు వర్మ. ఈ రెండు అంచెలవారీగా మిగతా ప్లాట్‌ఫార్మ్‌లో రిలీజ్‌ చేస్తామని చెప్పారు రాంగోపాల్‌వర్మ.

శపథం ఆరంభం చాప్టర్ 1, శపథం అంతం చాప్టర్ 2 రెండు కూడా తీసిన ఉద్ధేశ్యం ఏమి దాచకుండా చూపిస్తామని అన్నారు. అలాగే ఫస్ట్ డే ఫస్ట్ షో ప్రోగ్రాంలో భాగంగా ఏపీ ఫైబర్ నెట్ లో వ్యూహం సినిమాను రిలీజ్ చేస్తున్నామని ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పూనురు గౌతమ్ రెడ్డి వెల్లడించారు. ఓటీటీ ద్వారా శపథం వెబ్ సిరీస్ రిలీజ్ చేస్తామని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలపై తెరకెక్కిన వ్యూహం శపథం సినిమాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచాయి. ఇప్పటికే వ్యూహం సినిమా థియేటర్లలో రన్ అవుతుంది. ఎన్నో వాయిదాల తర్వాత ఈ సినిమా అడియన్స్ ముందుకు వచ్చింది. ఇక రెండో పార్ట్ శపథం మాత్రం రేపు మార్చి 8న రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే ఈ రెండు సినిమాలను వెబ్ సిరీస్ గా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నామని ప్రకటించారు వర్మ. నిజానికి ఈ సినిమాలు ఫిబ్రవరి 23న వ్యూహం, మార్చి 1న శపథం రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాలతో ఈ రెండు సినిమాలు వాయిదా పడ్డాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.