Tollywood: కష్టాలతో జీవనం.. డిప్రెషన్‏తో పోరాటం.. ఇంట్లో సామాన్లు అమ్మే స్థితిలో స్టార్ డైరెక్టర్.. చివరకు..

నిన్న ఒక్కరోజే ఆరు కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు సమాచారం. వినాయక్ దామోదర్ సావర్కర్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో బిగ్ బాస్ సీజన్ 17 ఫేమ్ అంకితా లోఖండే, అమిత్ సియాల్ కీలకపాత్రలు పోషించారు. జీ స్టూడియోస్ బ్యానర్ పై ఆనంద్ పండిట్, సందీప్ సింగ్, రణదీప్ హుడా ఈ చిత్రాన్ని నిర్మించారు. స్వాతంత్ర పోరాట సమయంలో భారతదేశం కోసం పోరాడిన వినాయక్ దామోదర్ సావర్కర్ జీవితాన్ని.. ఆయన చేసిన పోరాట ప్రయాణాన్ని ఈ చిత్రంలో చూపించారు.

Tollywood: కష్టాలతో జీవనం.. డిప్రెషన్‏తో పోరాటం.. ఇంట్లో సామాన్లు అమ్మే స్థితిలో స్టార్ డైరెక్టర్.. చివరకు..
Randeep Hooda
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 25, 2024 | 8:51 AM

బాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా.. దర్శకుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు రణదీప్ హుడా. ఎన్నో సినిమాలను రూపొందించి ప్రేక్షకులను అలరించారు. ఆ తర్వాత అనుహ్యంగా సినీ పరిశ్రమకు దూరమయ్యారు. చాలా కాలం తర్వాత ఆయన నటించిన లేటేస్ట్ సినిమా ‘స్వాతంత్రవీర్ సావర్కర్’. ఈ చిత్రానికి ఆయన స్వీయ దర్శకత్వం వహించారు. ఈ శుక్రవారం విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. నిన్న ఒక్కరోజే ఆరు కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు సమాచారం. వినాయక్ దామోదర్ సావర్కర్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో బిగ్ బాస్ సీజన్ 17 ఫేమ్ అంకితా లోఖండే, అమిత్ సియాల్ కీలకపాత్రలు పోషించారు. జీ స్టూడియోస్ బ్యానర్ పై ఆనంద్ పండిట్, సందీప్ సింగ్, రణదీప్ హుడా ఈ చిత్రాన్ని నిర్మించారు. స్వాతంత్ర పోరాట సమయంలో భారతదేశం కోసం పోరాడిన వినాయక్ దామోదర్ సావర్కర్ జీవితాన్ని.. ఆయన చేసిన పోరాట ప్రయాణాన్ని ఈ చిత్రంలో చూపించారు. ఈ క్రమంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రణదీప్ హుడా తన జీవితంలో ఎదుర్కోన్న కష్టాల గురించి చెప్పుకొచ్చారు. బ్యాటిల్ ఆఫ్ సారాగర్హి సినిమాతో కష్టాల్లో కూరుకుపోయానని.. దీంతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయానని అన్నారు.

హ్యూమన్స్ ఆఫ్ బాంబేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రణ్‌దీప్ మాట్లాడుతూ “నేను బ్యాటిల్ ఆఫ్ సారాగర్హి సినిమా కోసం చాలా కష్టపడ్డాను. మూడేళ్లుగా గడ్డం, జుట్టు పెంచాను. ఆ పాత్ర కోసం పూర్తిగా సిద్ధమయ్యాను. కానీ ఆ సినిమా పూర్తి కాలేదు. ఇది నాకు చాలా కష్టమైన సమయం. దీంతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను. నా జీవితం సగం ముగిసినట్లు అనిపించింది. అంతకుముందు గోల్డెన్ టెంపుల్ కి వెళ్లి సినిమా పూర్తయ్యే వరకు జుట్టు కత్తిరించుకోనని ప్రార్ధించాను. ఆ తర్వాత జుట్టు కట్ చేశాను. కానీ ఆ తర్వాతే అసలు యుద్ధం స్టార్ట్ అయ్యింది. సినిమా తర్వాత దాదాపు మూడేళ్లు ఎలాంటి ఉద్యోగం లేదు. అలాగే బరువు పెరిగి భయంకరంగా కనిపించాను. ఏం చేయాలో అర్థం కాలేదు. నన్ను చూసి నా తల్లిదండ్రులు ఆందోళన చెందారు.

ఆర్థికంగా సమస్యలు ఎదుర్కొన్నాను. కానీ అప్పుడు జీవితంతో..కష్టాలతో చేసిన పోరటమే.. ఇప్పుడు నన్ను నటుడిగా మరింత ఎదిగేలా చేసింది. మనకు వెంటనే విజయం వస్తే మనం నటులం కాలేము. కష్టపడి పనిచేయడం మానేస్తే పోరాటం చేయాల్సి వస్తుంది” అంటూ చెప్పుకొచ్చారు. రణదీప్ సినిమా ‘స్వాతంత్రవీర్ సావర్కర్’ రెండు రోజుల్లో రూ.4.85 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రాన్ని లండన్‌, మహారాష్ట్ర, అండమాన్‌ నికోబార్‌ దీవుల్లోని పలు ప్రాంతాల్లో చిత్రీకరించారు. ఇంతకుముందు ఈ చిత్రానికి మహేష్ మంజ్రేకర్ దర్శకత్వం వహించబోతున్నారు. కానీ షూటింగ్ సమయంలో రణదీప్ తో వచ్చిన కొన్ని విభేదాల కారణంగా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.