
ప్రస్తుతం భారతీయ సినిమా ప్రపంచంలో మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ SSMB 29. బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో ప్రపంచస్థాయిలో చరిత్ర సృష్టించిన దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఓ రేంజ్ హైప్ నెలకొంది. ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. హాలీవుడ్ యాక్షన్ ఎంటర్టైనర్ రేంజ్ లో ఈ సినిమా ఉండనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని దాదాపు 120 దేశాల్లో రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే మహేష్ బాబు ప్రీ లుక్ పోస్టర్ రిలీజ్ చేయగా.. విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా టైటిల్ రివీల్ చేసే సమయం ఆసన్నమైంది. నవంబర్ 15నఈ సినిమాకు సంబంధించిన బిగ్ అప్డేట్ ఉండనుంది.
ఇవి కూడా చదవండి : Kamal Haasan : ఆరేళ్ల వయసులోనే సినిమాల్లోకి.. ఒక్కో సినిమాకు రూ.150 కోట్లు.. కమల్ హాసన్ ఆస్తులు ఎంతో తెలుసా.. ?
నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీలో గ్లోబ్ ట్రాటర్ పేరుతో భారీ ఈవెంట్ నిర్వహించనుంది చిత్రయూనిట్. ఈ వేడుకకు టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి రోజుకో అప్డేట్ షేర్ చేస్తున్నారు జక్కన్న. ఇప్పటికే పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ షేర్ చేయగా.. ఇటీవల మహేష్ పాత్ర గురించి తెలుపుతూ శ్రుతిహాసన్ పాడిన పాటను రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ పోస్టర్ షేర్ చేశారు.
ఈ సినిమాలో ఆమె మందాకిని అనే పాత్రలో కనిపించనున్నారు. ‘And now she arrives… Meet MANDAKINI’ (ఆమె వస్తోంది… ఆమే మందాకిని) అనే క్యాప్షన్‌తో దర్శకుడు రాజమౌళి తన ఇన్ స్టాలో పంచుకున్నారు. ఈ పోస్టర్ లో ప్రియాంక చోప్రా.. చీరకట్టులో.. హీల్స్ ధరించి.. చేతిలో పిస్టల్ తో ఎంతో డైనమిక్ గా.. పవర్ ఫుల్ గా కనిపిస్తూ సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెంచేశారు. ఈ పోస్టర్ విడుదలైన క్షణాల్లో సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇప్పుడు ప్రియాంక ఫస్ట్ లుక్ పోస్టర్ తో సినిమాపై మరింత హైప్ పెరిగింది.
ఇవి కూడా చదవండి : Venky Movie: వెంకీ సినిమాను మిస్సైన హీరోయిన్ ఎవరో తెలుసా.. ? రవితేజతో జోడి కట్టాల్సిన బ్యూటీ ఎవరంటే..