
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా SSMB 29. ఇది కేవలం వర్కింగ్ టైటిల్ మాత్రమే. ఆర్ఆర్ఆర్ తర్వాత జక్కన్న తెరకెక్కిస్తోన్న ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. యాక్షన్ అడ్వెంచర్ డ్రామాగా వస్తోన్న ఈ సినిమా షూటింగ్ కొన్ని నెలలుగా జరుగుతుంది. మొదటి నుంచి భారీ హైప్ నెలకొన్న ఈ సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదివరకు మహేష్ ప్రీ లుక్ పోస్టర్ చేయగా.. విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ మూవీకి సంబంధించిన ఎప్పుడెప్పుడు వస్తాయా ? అని వెయిట్ చేస్తున్న అభిమానులకు ఈరోజు ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చారు జక్కన్న. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, మలయాళీ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలకపాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే.
ఇక తాజాగా SSMB 29 గురించి తన సోషల్ మీడియా ఖాతాలో రాసుకొచ్చారు జక్కన్న. “సినిమాలోని మూడు ప్రధాన పాత్రలతో క్లైమాక్స్ షూట్ జరుగుతుంది. మరోవైపు #GlobeTrotter ఈవెంట్ కోసం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇంతకు ముందెన్నడు చూడని విధంగా ఇది మీ ముందుకు రానుంది. నవంబర్ 15న మీరంతా ఈ ఈవెంట్ ను చాలా ఎంజాయ్ చేస్తారు.. ఆ రోజు కోసం నేను కూడా ఎదురుచూస్తున్నాను. దానికంటే ముందు మూరు ఈ వారమంతా మరింత హుషారుగా ఉండేందుకు ఈరోజు పృథ్వీరాజ్ ఫస్ట్ లుక్ విడుదల కానుంది” అంటూ రాసుకొచ్చారు జక్కన్న. దీంతో మహేష్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి : Meenakshi Chaudhari: ఆ హీరో సినిమాలో నటించి తప్పు చేశాను.. వారం రోజులు అలాంటి బాధ.. మీనాక్షి చౌదరి..
ముందు నుంచి #GlobeTrotter హ్యాష్ ట్యాగ్ ద్వారా ఈ సినిమాను అడియన్స్ లోకి తీసుకెళ్తున్నారు జక్కన్న. ఈ సినిమాకు సంబంధించిన పోస్టులు పెట్టిన ప్రతిసారీ ఈ హ్యాష్ ట్యాగ్ ఉపయోగిస్తున్నారు. ఇక నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా ఈ గ్రాండ్ ఈవెంట్ జరుగనుంది. ఇప్పటికే దీని కోసం భారీ సెట్ ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో #SSMB29 టైటిల్ తోపాటు మహేష్ బాబు ఫస్ట్ లుక్ సైతం విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ఈవెంట్ జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.
ఇవి కూడా చదవండి : Cinema : 64 ఏళ్ల హీరో సరసన 27 ఏళ్ల హీరోయిన్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..