Raghavendra Rao: ‘తెలుగు తల్లి కన్నీరు పెడుతుంది’.. NTR వర్సిటీ పేరు మార్పుపై దర్శకేంద్రుడు ఎమోషనల్

తాజాగా డైరెక్టర్ రాఘవేంద్ర రావు ట్విట్టర్ వేదికగా తమ నిర్ణయాన్ని తెలిపారు. తారకరామారావు పేరు మార్చడం పట్ల తెలుగు తల్లి సిగ్గుపడుతోందని.. కన్నీరు పెడుతుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

Raghavendra Rao: తెలుగు తల్లి కన్నీరు పెడుతుంది.. NTR వర్సిటీ పేరు మార్పుపై దర్శకేంద్రుడు ఎమోషనల్
Ragavendra Rao

Edited By: Ram Naramaneni

Updated on: Sep 24, 2022 | 3:42 PM

ప్రస్తుతం ఏపీలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం ఇప్పుడు పెద్ద దుమారాన్నే రేపింది. వర్సిటీ పేరు మారుస్తూ వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై టీడీపీ నేతలు..అభిమానులు మండిపడుతున్నారు. రాష్ట్రంలోని అభిమానులు పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్ కుటుంబసభ్యులు కూడా ఒక్కొక్కరుగా ఈ వివాదం పై స్పందిస్తున్నారు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ స్పందించగా.. తాజాగా డైరెక్టర్ రాఘవేంద్ర రావు ట్విట్టర్ వేదికగా తమ నిర్ణయాన్ని తెలిపారు. తారకరామారావు పేరు మార్చడం పట్ల తెలుగు తల్లి సిగ్గుపడుతోందని.. కన్నీరు పెడుతుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

“తెలుగు వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన మహనీయుడు అన్న నందమూరి తారక రామారావు గారు. ఆయన పేరుతో ఉన్న హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం పట్ల తెలుగు తల్లి సిగ్గుపడుతోంది. కన్నీరు పెడుతోంది” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

ట్వీట్..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.